Andhra Pradesh: రాబోయే ఎన్నికల్లో వచ్చేది మేమే.. జాగ్రత్తగా ఉండండి.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

|

Jul 01, 2022 | 6:41 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసుల తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు సైకోలుగా తయారవుతున్నారా..? అని ప్రశ్నించారు. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు....

Andhra Pradesh: రాబోయే ఎన్నికల్లో వచ్చేది మేమే.. జాగ్రత్తగా ఉండండి.. వైసీపీపై చంద్రబాబు ఫైర్
Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసుల తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు సైకోలుగా తయారవుతున్నారా..? అని ప్రశ్నించారు. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. సోషల్ మీడియా పేరు చెప్పి తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారం చేస్తే ఊరుకోమని, ఖబద్దార్ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది సైకో ప్రవర్తన ఉన్న పోలీసు అధికారులతో నిబంధనలకు వ్యతిరేకంగా టార్చర్‌ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పోరాటం పోలీసులపై కాదని, వైసీపీ పైనేనని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్‌లు వెంకటేశ్‌, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని, తప్పుడు అధికారులను వదిలిపెట్టనని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో 600మందిపై కేసులు పెట్టారన్న చంద్రబాబు.. 41ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తానని.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా పట్టించుకోకుండా భయం లేకుండా ముందుకు వెళ్తున్నారు. రఘురామ కృష్ణంరాజును కస్టడీలో చంపే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా పేరు చెప్పి తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాం…గుర్తు పెట్టుకోండి.

 – నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారన్న చంద్రబాబు.. సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా అని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లాలా? ఇంటి గోడలు దూకి వెళ్లాలా.. లైట్లు పగలగొడతరా? ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టును సైతం లెక్క చేయని విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..