Buddha Venkanna: బెజవాడలో కర్రలతో బుద్దా వెంకన్న హంగామా.. చెంపలు వాయిస్తామంటూ వార్నింగ్

టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడలో నానా హంగామా చేశారు. కర్రలతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించారు.

Buddha Venkanna: బెజవాడలో కర్రలతో బుద్దా వెంకన్న హంగామా.. చెంపలు వాయిస్తామంటూ వార్నింగ్
Tdp Leader Buddha Venkanna
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 20, 2021 | 9:56 AM

టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడలో నానా హంగామా చేశారు. కర్రలతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఒక చెంపపై కొడితే రెండు చెంపలూ వాయిస్తామంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. బుద్దా వెంకన్న హంగామాతో అతని ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుద్దా వెంకన్న అరెస్ట్‌ సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. బుద్దా వెంకన్న అరెస్ట్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బుద్దా వెంకన్న సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో హైఓల్టేజ్ సీన్ క్రియేట్ అయ్యింది. ఈ తోపులాటలో బుద్దా చొక్కా కూడా చిరిగిపోయింది. చివరికి బుద్దాను బలవంతంగా జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్నాళ్లు తమకు చంద్రబాబు గాంధీ గారి సిద్ధాంతం చెప్పారని.. ఇకపై లెక్క వేరన్నారు బుద్దా వెంకన్న. మా చివరి రక్తపు బొట్టు వరకూ తాము బాబుతోనే ఉంటామనీ.. తాము ఆయారాం గయారాంలు కామనీ అన్నారు.

పట్టాభి వ్యాఖ్యలతో ఏపీ రగిలిపోతోంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో టెన్షన్‌..టెన్షన్‌ నెలకొంది. పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటితో పాటు టీడీపీ కార్యాలయాలపైనా దాడులు చేశారు. వైసీపీ దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన పిలుపుతో బంద్‌ కొనసాగుతోంది. ఇక టీడీపీ బంద్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడిక్కడ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. విశాఖ జగదాంబ జంక్షన్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖ పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్ అనంతలక్ష్మితోపాటు పలువురు మహిళా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కూడా ఆందోళనలు చేపట్టింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తెల్లవారుజామునుంచే టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. భారీగా బలగాలను మోహరించారు.

Also Read:  మీరు వాడే వంట నూనె స్వచ్చమైనదా..? కల్తీదా..? ఇలా తెలుసుకోండి..!

ఉదయాన్నే ఈ పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే