Andhra Pradesh: వైసీపీ 175 స్థానాలు గెలిస్తే టీడీపీ ఆఫీస్ లకు తాళాలు వేసుకుంటాం.. అచ్చెన్నాయుడు సెన్షేషనల్ కామెంట్

|

Jun 09, 2022 | 4:02 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు మళ్లీ వైసీపీకే ఓటేసేంత అమాయకులు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకముంటే...

Andhra Pradesh: వైసీపీ 175 స్థానాలు గెలిస్తే టీడీపీ ఆఫీస్ లకు తాళాలు వేసుకుంటాం.. అచ్చెన్నాయుడు సెన్షేషనల్ కామెంట్
Acennaidu
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు మళ్లీ వైసీపీకే ఓటేసేంత అమాయకులు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకముంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీస్ లకు తాళాలువేసుకుంటామని వెల్లడించారు. ఏం చేశారని 175 స్థానాల్లో వైసీపీ(YCP) ని ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ జగన్‌కే ఓట్లేసేంత అమాయకులు కాదన్న అచ్చెన్న.. నారా లోకేశ్‌ జూమ్‌ మీటింగ్ లో వైసీపీ వాళ్లు దొంగల్లా చొరబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను భయపెట్టి జూమ్ మీటింగ్‌లోకి వచ్చారని ఆరోపించారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వారికి 8 నెలల డెడ్‌లైన్‌ పెట్టారు. ఆ లోపు ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాల్సిందేనని, సున్నితంగా హెచ్చరించారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంపై ప్రతి నెలా సమీక్ష ఉంటుందని తేల్చి చెప్పారు. గడప గడపకు వెళ్లి కార్యక్రమాలను వివరించాలని, ప్రతి ఒక్కరినీ కలవాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని సూచించారు. ప్రజల నుంచి అందే విజ్ఞాపనలు, వాటి పరిష్కారమే ముఖ్యంగా ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. దీనికోసం ఇకపై నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. చరిత్రలో ఒక ముద్ర వేశామన్న ముఖ్యమంత్రి జగన్.. సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలూ సాధించటమే లక్ష్యమని సీఎం చెప్పారు. ఇది పెద్ద కష్టమేమీ కాదన్న ముఖ్యమంత్రి.. కుప్పంలోనూ గెలుస్తామని నేతలకు స్పష్టం చేశారు. అందు కోసం అందరూ కష్టపడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి