Kadapa News: అతనో పార్టీకి లీడర్.. కానీ.. అతను ఓ సభలో సొంత పార్టీయే పోవాలి.. అంటూ స్లోగన్ ఇచ్చారు.. తీరా గమనించే లోపే జరిగాల్సిందంతా జరిగిపోయింది.. ఈ స్లోగన్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లాలో ఓ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చేసిన స్లోగన్ ఆ పార్టీ నేతలను తలపట్టుకునేలా చేసింది. ఈనెల 19న టిడిపి బస్సు యాత్ర కడపకు చేరుకున్న సందర్భంలో టీడీపీ నేతలు అందరూ ఒక వేదిక పైకి చేరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గడుతూ మీటింగ్ నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా సదరు కడప టిడిపి నేత మాత్రం స్టేజిపై ఒక్కసారిగా స్లోగన్ చేస్తూ సైకిల్ పోవాలి అని మాట్లాడటంతో ఒక్కసారిగా స్టేజి మీద ఉన్న నేతలు అందరూ అవాక్కయ్యారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నేతలు అందరూ స్టేజీ మీద ఉండగా అందరి సమక్షంలో సదరు కడప నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అమీర్ బాబు తన ప్రసంగాన్ని ఇస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని స్టేజిపై మాట్లాడి చివర్లో స్లోగన్ చేస్తూ సైకిల్ పోవాలి అని అనడంతో స్టేజి మీద ఉన్న జిల్లా నేతలందరూ షాక్ అయి అమీర్ బాబు చేతిలో ఉన్న మైక్ ను లాగేశారు.
అది యాదృచ్ఛికంగా అన్న మాటే అయినా సదరు కడప జిల్లా నేతలను మాత్రం కలవరపెడుతుంది.. ఈ మాటలు అధికారపక్ష పార్టీ సోషల్ మీడియా కడప జిల్లాలో బ్రహ్మాస్త్రంగా వాడుతూ మీ నేతలే సైకిల్ పోవాలి అని అంటుంటే ప్రజలు మాత్రం ఎందుకు కోరుకోరు అంటూ తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మామూలుగానే కడప జిల్లాలో ఆచితూచి అడుగులు వేసే టిడిపి నేతలు అమీర్ బాబు మాట్లాడిన ఈ మాటతో ఒక్క సారిగా గప్ చుప్ అయ్యారు..
మరిన్ని ఏపీ వార్తల కోసం..