Guntur: ఖాళీ కుండలు పగలకొట్టి టీడీపీ వినూత్న నిరసన.. గుంటూరు కార్పోరేషన్ ఎదుట ఉద్రిక్తత..

Guntur News in Telugu: గుంటూరు కార్పోరేషన్ వద్ద ఉద్రికత్త నెలకొంది. కార్పోరేషన్ కార్యాలయం వద్ద కుండలు పగులకొట్టి మరి టిడిపి కార్పోరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కార్పోరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో త్రాగునీరు సక్రమంగా..

Guntur: ఖాళీ కుండలు పగలకొట్టి టీడీపీ వినూత్న నిరసన.. గుంటూరు కార్పోరేషన్ ఎదుట ఉద్రిక్తత..
TDP Corporators Protest In front of Guntur Corporation

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jun 23, 2023 | 11:38 AM

Guntur News in Telugu: గుంటూరు కార్పోరేషన్ వద్ద ఉద్రికత్త నెలకొంది. కార్పోరేషన్ కార్యాలయం వద్ద కుండలు పగులకొట్టి మరి టిడిపి కార్పోరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కార్పోరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో త్రాగునీరు సక్రమంగా పంపిణీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేటర్లు కొందరు ఖాళీ కుండలతో కార్యాలయం ఎదుట బైఠాయించగా.. అదే సమయంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు కార్యాలయంలోకి వెళ్ళేందుకు వచ్చారు.

అలాగే మేయర్ కారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా టిడిపి కార్పోరేటర్లు నినాదాలు చేశారు. విలీన గ్రామాల ‌ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మేయర్ పట్టించుకోవటం లేదన్నారు. కారును అడ్డుకొని ఖాళీ కుండలు పగలకొట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టిడిపి కార్పోరేటర్లను పక్కకు నెట్టేసి మేయర్ కారును కార్యాలయంలోకి పంపించారు. మరోవైపు ఆధునీకరించిన కౌన్సిల్ హాల్‌ను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కౌన్సిల్ సమావేశం హాట్ హాట్‌గా జరుగుతుంది.

-టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు రిపోర్టర్

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.