ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్.. ఖాకీలను షేక్ చేస్తోంది. ఓ వైపు టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు గోబ్యాక్ చంద్రబాబు అంటూ ఫ్లెక్సీల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఫ్లెక్సీవార్ పీక్స్‌కి చేరింది. అది హద్దులు దాటితే అన్న అనుమానాలతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వైఎస్సార్ డాక్టర్ సెల్ కన్వీనర్ నాగభూషణ్ రెడ్డి పేరుతో ఈ పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు సత్తెనపల్లిలో ఫ్లెక్సీల ఏర్పాటుపై పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.
అటు అమరావతిలోనూ సేమ్ సిట్యువేషన్. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిన్న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ వైసీపీ శ్రేణులకి ఎలా అనుమతిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు.
మొన్న పల్నాడు జిల్లా అచ్చంపేటలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్లెక్సీలు కట్టేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయతిస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..