Chandrababu Naidu: నా రికార్డు బ్రేక్ చేయాలంటే.. రెండు రాష్ట్రాలు ఏకమవ్వాలి: టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

|

Dec 02, 2021 | 8:23 PM

TDP Chief Chandrababu Naidu: తనకు రికార్డులు, అవార్డులు అవసరం లేదని.. అసలు తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ తన రికార్డును

Chandrababu Naidu: నా రికార్డు బ్రేక్ చేయాలంటే.. రెండు రాష్ట్రాలు ఏకమవ్వాలి: టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu Naidu
Follow us on

TDP Chief Chandrababu Naidu: తనకు రికార్డులు, అవార్డులు అవసరం లేదని.. అసలు తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ తన రికార్డును బ్రేక్ చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువారం మాట్లాడారు. అసెంబ్లీలో తమ కుటుంబం గురించి మాట్లాడారని.. ఇలాంటి సభలో ఇక ఉండనని చెప్పానంటూ గుర్తుచేశారు. గౌరవంగా సభ నడిపినప్పుడే సభకు వస్తానంటూ తేల్చిచెప్పారు. దానికోసం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని స్పష్టంచేశారు. మళ్లీ కచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తానని.. పోరాటం చేస్తానంటూ తెలిపారు. తనకు రికార్డులు, అవార్డులు అవసరం లేదన్నారు. తన రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరని.. ఒకవేళ బ్రేక్ చేయాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాల్సిందేనని తెలిపారు.

కుటుంబాలను రాజకీయాల్లోకి లాగవద్దని సూచించారు. గ్రామాల్లో గౌరవ సభలు పెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. సమస్యలు, తాజా పరిస్థితులపై ప్రజలకు వివరించాలని సూచించారు. చనిపోయిన ఎనిమిది మంది కార్యకర్తలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. క్వారీలో పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే గురజాల, దాచేపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం మాదేనని పేర్కొన్నారు. 8 మంది హత్యకు ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలారా అంటూ ప్రశ్నించారు. హత్యలకు కార్యకర్తలు భయపడురని.. పగ తీర్చుకోవాలనే భావన పెరుగుతుందని పేర్కొ్న్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్ళకి, ఇచ్చిన ఇంటి స్థలాలకు ఇప్పుడు పట్టా ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు.

తాను సీఎం అయిన వెంటనే… అన్ని ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తాన్నారు. పట్టాలకు రూ.10 వేలు ఎందుకు కట్టాలి.. అసలు జగన్ రెడ్డి ఉన్నకు హక్కేంటి అని ప్రశ్నించారు. వరదలు వస్తే హెచ్చరికలు కూడా చెయ్యలేదని దుయ్యబట్టారు. ఊళ్లల్లో ఇసుక కూడా దొరకుండా చేశారని.. నెల్లూరు ముంపునకు ఇసుక అక్రమ తవ్వకాలే కారణమన్నారు. ఓ మంత్రి వరి పంట వేయవద్దు అంటారు.. మరి ఏం వెయ్యాలి.. గంజాయి పంట వేయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సీఎం స్పెషల్ స్టేటస్ తేలేడు కానీ.. స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మద్యం తెస్తున్నాడంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Also Read:

Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..

Viral Video: ఏనుగుల ప్రాంతానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న టూరిస్ట్‌లు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..