Chandrababu: పక్కా ప్రణాళిక ప్రకారమే వైఎస్ వివేకా హత్య.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

|

May 18, 2023 | 9:22 AM

Chandrababu on ys viveka murder case: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకా మర్డర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ మర్డర్ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందంటూ పేర్కొన్నారు. ఒక వైపు బాబాయ్.. మర్డర్ జరుగుతుంటే ఇంకో వైపు పార్టీ మ్యానిఫెస్టో మీటింగ్ పేరుతో డ్రామా ఆడారంటూ ఆరోపించారు.

Chandrababu: పక్కా ప్రణాళిక ప్రకారమే వైఎస్ వివేకా హత్య.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu
Follow us on

Chandrababu on ys viveka murder case: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకా మర్డర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ మర్డర్ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందంటూ పేర్కొన్నారు. ఒక వైపు బాబాయ్.. మర్డర్ జరుగుతుంటే ఇంకో వైపు పార్టీ మ్యానిఫెస్టో మీటింగ్ పేరుతో డ్రామా ఆడారంటూ ఆరోపించారు. రాయలసీమలో ఒక హత్య చేస్తున్నప్పుడు.. పోలీసులకు దొరకకుండా ఇంకో వైపు ఇలాంటి నాటకాలు ఆడుతుంటారంటూ విమర్శించారు. అజేయ కల్లాం లాంటి రిటైర్డ్ అధికారులను కూడా పిలిచి మర్డర్ కేసును దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశారన్నారు. ఐదు గంటల సమయంలోనే మా బాబాయ్ కు గుండె పోటు వచ్చిందని అజేయ కళ్ళాం వాళ్ళ దగ్గర దొంగ ఏడుపులు ఏడ్చారన్నారు. దానర్థం బాబాయ్ మర్డర్ లో చాలా మంది పాత్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు.

విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్డు షోలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. కరకట్టలో తాను నివాసం ఉంటున్న ఇంటికి నోటీస్ లు ఇవ్వడం పై స్పందిస్తూ.. కరకట్టపై నేను అద్దెకుంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు.. లేని రింగ్ రోడ్డును సృష్టించి నేనెవరికో లబ్ధి చేకూర్చి గెస్ట్ హౌస్ గిఫ్ట్ గా పొందానని అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. క్విడ్ ప్రో కింద నోటీసులంట.. జగన్ లా నాకు ఎక్కడికక్కడ ప్యాలెస్‌లు లేవన్నారు. కరకట్ట ఇంటికి నేను నెల నెల అద్దె కడుతున్నాను.. ప్రజా వేదికని కూల్చడంతో పాలన ప్రారంభించిన ఈ వ్యక్తి గురించి ఎక్కువ ఆశించలేమంటూ విమర్శించారు.

మిమ్మల్ని ఒప్పించే అమరావతి రాజధానిగా విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటి రాజధానిగా చేయాలనీ నిర్ణయించామని గుర్తుచేశారు. వీళ్ళ వేషాలు తెలిసే 2014 లో విజయలక్ష్మిని మీరు ఓడించి పంపారన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా తలదించుకుని వెళ్తున్నామంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..