Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు.. పెట్రోల్ బాదుడుపై జగన్ సర్కార్‌ను ప్రశ్నించిన చంద్రబాబు..

|

May 23, 2022 | 12:12 PM

పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయమని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలో..

Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు.. పెట్రోల్ బాదుడుపై జగన్ సర్కార్‌ను ప్రశ్నించిన చంద్రబాబు..
Chandrababu
Follow us on

మరోసారి జగన్ సర్కార్ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుద‌ల‌పై చంద్రబాబు మండిప‌డ్డారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయమని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎద్దేవ చేశారు. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుందన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వాలు మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించడం లేదని మండిపడ్డారు. గత ఏడాది చివర్లో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా.. అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు కేంద్రం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని చంద్రబాబు జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి డిమాండ్ చేశారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి