YS Jagan: మేమంతా సిద్ధం యాత్ర.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్ నేతలు..

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో సీఎం జగన్‌ రోడ్‌షో చేపడతారు. అయితే జువ్విగుంట నైట్‌ పాయింట్‌ దగ్గర ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు CM జగన్‌ను కలుసుకున్నారు.

YS Jagan: మేమంతా సిద్ధం యాత్ర.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్ నేతలు..
Ys Jagan

Updated on: Apr 07, 2024 | 1:35 PM

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో సీఎం జగన్‌ రోడ్‌షో చేపడతారు. అయితే జువ్విగుంట నైట్‌ పాయింట్‌ దగ్గర ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు CM జగన్‌ను కలుసుకున్నారు. తమ పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. కాగా.. గోదావరి జిల్లాల నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దెందులూరుకు చెందిన ప్రముఖ బీసీ సంఘాల నేతలతోపాటు, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు అధికారపార్టీలో చేరారు. సీఎం జగన్‌ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. TDP BC సాధికార స్టేట్‌ కన్వీనర్‌, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ భానుప్రకాష్‌, గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస్‌రావు, జిల్లా గౌడసంఘం ఏత వరప్రసాద్‌ వైసీపీలో చేరారు.

వీడియో చూడండి..

అలాగే కాంగ్రెస్‌ నేత, దెందులూరు ఇన్‌ఛార్జ్‌ DVRK చౌదరి, DCC కార్యదర్శి CH కిరణ్‌ కూడా వైసీపీలో చేరారు. వీరితోపాటు పెదవేగి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌ని కూడా సీఎం జగన్‌, వైసీపీలోకి ఆహ్వానించారు.

ఇదిలాఉంటే.. కావలి వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పంచ్‌లు, ప్రాసలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మోసాలు, వెన్నుపోట్లతో 14 ఏళ్లు సీఎంగా చేశారని మండిపడ్డారు. ఓటు వేస్తే కిలో బంగారం, బెంజ్‌కారు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. సూపర్‌-6, సూపర్‌-7 పేరుతో మభ్యపెడుతున్నారంటూ చురకలు అంటించారు జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..