Tamil Nadu: ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. చేతికందిన కూతురు మృతితో తల్లిడిల్లిన తల్లిదండ్రులు..!

| Edited By: Balaraju Goud

May 31, 2024 | 10:29 AM

చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో తెలుగు అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పట్టుతప్పి పట్టాలపై పడి, కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పిల్లి ధరణిసత్య (23) మృతిచెందింది. చెన్నై పెరుంగళత్తూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని యువతి మృత్యువాతపడిన ఘటనతో తాళ్ల రేవులో విషాదం అలముకుంది.

Tamil Nadu: ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. చేతికందిన కూతురు మృతితో తల్లిడిల్లిన తల్లిదండ్రులు..!
Software Employee Dies
Follow us on

చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో తెలుగు అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పట్టుతప్పి పట్టాలపై పడి, కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పిల్లి ధరణిసత్య (23) మృతిచెందింది. చెన్నై పెరుంగళత్తూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని యువతి మృత్యువాతపడిన ఘటనతో తాళ్ల రేవులో విషాదం అలముకుంది.

మాధవరాయునిపేటకు చెందిన పిల్లి ఏడుకొండలు, ఈశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ధరణిసత్య, పావనిశ్రీహిత, భవానిశ్రీభవ్య. కూలి పనులు చేసుకునే దంపతలు ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్దకుమార్తె ధరణిసత్య బీటెక్‌ పూర్తి చేసి ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యారు. 8 నెలల క్రితం చెన్నైలోని పెరుంగళతూర్‌ సదన్‌ల్యాండ్‌ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. స్నేహితులతో కలిసి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తోంది.

అయితే రోజు వారి క్రమంలో భాగంగా బుధవారం ఉదయం తన స్నేహితులతో కలిసి డ్యూటీకీ వెళుతూ ప్రమాదానికి గురైంది. లోకల్‌ ట్రైన్‌ దిగి పెరుంగళతూర్‌ ప్రాంతంలో రైల్వేట్రాక్‌ దాటుతుండగా, వేగంగా వచ్చిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలు ధరణి సత్యను ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబసభ్యులకు ప్రమాద సమాచారం ఇచ్చారు రైల్వే పోలీసులు. చెన్నై క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆడ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలనూ ప్రోత్సహించారు. పెద్ద కుమార్తె ఉద్యోగం చేయడం, కుటుంబానికి బాసటగా నిలవడంతో మిగిలిన ఇద్దరు కూతుర్లను చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఆనందంలో ఉన్న వారిని పెద్ద బిడ్డ ఇక లేదనే విషయం తెలిసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..