AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: తునిలో తాడిపెద్దు బీభత్సం..10 మందిపై దాడి.. కుక్క కరవడంతో రాబిస్ సోకినట్లు నిర్ధారణ

తాడిపెద్దును అదుపుచేసి, తుని జనానికి ఉపశమనం కలిగించేందుకు మునిసిపల్ సిబ్బంది, పశుసంవర్థక అధికారులు, పోలీసులు ఒక్కటిగా చేరి తీవ్రంగా ప్రయత్నించారు. మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు.

Kakinada: తునిలో తాడిపెద్దు బీభత్సం..10 మందిపై దాడి.. కుక్క కరవడంతో రాబిస్ సోకినట్లు నిర్ధారణ
Kakinada Ox
Surya Kala
|

Updated on: Jul 23, 2022 | 7:17 AM

Share

Kakinada: తాడిపెద్దు(Tadipeddu) అంటే మామూలు ఎద్దు కాదు.. ఎద్దుల్లోకే ఎద్దు మేలు జాతి ముదురు ఎద్దు. చిర్రెత్తుకొచ్చిందంటే అది చేసే ఓవరాక్షన్‌కి.. సృష్టించే బీభత్సానికి హద్దూ అదుపూ ఉండదు. కాకినాడ జిల్లాలో ఓ తాడిపెద్దు తెగబడింది.. నానా హంగామా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తుని పట్టటణంలో (Tuni Town) నడిరోడ్లపై, జనావాసాలపై తాడిపెద్దు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.. కనిపించినవారిని కనిపించినట్టు వెంబడించి… కుమ్మిపారేసింది. రోడ్డు మీద వెళ్లే పాదచారులను, బైక్‌ల మీద వెళ్లే వారిని ఎవరినీ వదలకుండా దాడి చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 10 మందిపై దాడి చేసింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా ఏరియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

తునిలో తిష్టవేసిన తాడిపెద్దులు.. మనుషుల్నే కాదు.. సాటి పశువుల్ని కూడా భయపెట్టించాయి. నడి రోడ్డు మీదే ఎద్దులు పోట్లాడుకుని భయాందోళన కలిగించాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడేలా వణికించింది.

తాడిపెద్దును అదుపుచేసి, తుని జనానికి ఉపశమనం కలిగించేందుకు మునిసిపల్ సిబ్బంది, పశుసంవర్థక అధికారులు, పోలీసులు ఒక్కటిగా చేరి తీవ్రంగా ప్రయత్నించారు. మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే ఎద్దు చనిపోయింది. కుక్క కరవడం వల్ల ఆ ఎద్దుకు ర్యాబిస్ వ్యాధి వచ్చింది. అందువల్లే అలా ప్రవర్తించిందని వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. ఆ ఆంబోతుకు సంబంధించి ఎవరూ రాకపోవడంతో మున్సిపల్ అధికారులు.. డంపింగ్ యార్డుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..