పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని.. కావాలంటే ఏపీ కి రావాలని ఆంధ్రా మంత్రులు స్పందిస్తున్నారు. వీరి కామెంట్లపై తెలంగాణ(Telangana) మంత్రులు సైతం ప్రతిస్పందిస్తున్నారు. ఉన్న మాటే చెబితే ఎందుకంత ఉలుకని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని, అవసరమైతే ఆ వ్యాఖ్యలను తాను నిరూపిస్తానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన ప్రబోధానంద కేసులో అరెస్టులపై ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2018లో జరిగిన కేసులో నేటికీ అరెస్టుల పర్వం కొనసాగుతోందని అన్నారు. గొడవలో 150మంది ఉంటే ఇప్పటికే 2వందల మందిని అరెస్ట్ చేశారన్నారు. తాజాగా 46 పేర్లు కొత్తగా చేర్చారని, అందులో 36 మంది ముస్లింలు ఉన్నారని చెప్పారు. రేపల్లె అత్యాచారం ఘటనలో హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ను ఆయన తండ్రి వైఎస్, తల్లి విజయమ్మ సరిగానే పెంచినా ఆయన మాత్రం రాజారెడ్డిలా మారారని కామెంట్ చేశారు.
సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత అన్నారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని, ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
TRS vs BJP: తగ్గేదే లే.. ముదురుతున్న మాటల యుద్ధం.. కేటీఆర్, కిషన్ రెడ్డిల మధ్య ట్వీట్ వార్..
Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్