Vijayawada: కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు..

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 30, 2023 | 6:49 PM

Vijayawada: అప్పటికే నైట్ రౌండ్స్‌లో తాడేపల్లి పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే స్పందించిన తాడేపల్లి ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వారధి పైకి చేరుకున్నారు. పై నుంచి చూస్తే యువతి నీటిలో ఉన్నట్లు లీలగా కనిపించింది. వెంటనే ఎస్సై రమేష్, అతని సిబ్బంది బ్రిడ్జి కిందకు చేరుకోవడానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నడిచారు. అర్ధ రాత్రి కావటంతో ఇసుకలో నడుచుకుంటూ నీరు ఉన్న..

Vijayawada: కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు..
Police Rescueing Woman
Follow us on

విజయవాడ, సెప్టెంబర్ 30: అర్ద రాత్రి పన్నెండు గంటల సమయం.. కనక దుర్గమ్మ వారధి పైకి ఒక స్కూటర్ దూసుకు వచ్చింది. స్కూటర్‌పై ఉన్న యువతి ఆందోళనగా ఉన్నట్లుగా చూసిన వారు గుర్తించారు. వేగంగా 26, 27 పిల్లర్ దగ్గరకు వచ్చింది. అక్కడే బైక్ పార్క్ చేసింది. తన వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ బైక్‌లో పెట్టింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో బ్రిడ్జిపై నుండి కష్ణా నదిలోకి ఇతరులు చూస్తుండగానే దూకేసింది. ఆమె దూకిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు వెంటనే 112 నెంబర్‌కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో అప్పటికే నైట్ రౌండ్స్‌లో తాడేపల్లి పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే స్పందించిన తాడేపల్లి ఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వారధి పైకి చేరుకున్నారు. పై నుంచి చూస్తే యువతి నీటిలో ఉన్నట్లు లీలగా కనిపించింది. వెంటనే ఎస్సై రమేష్, అతని సిబ్బంది బ్రిడ్జి కిందకు చేరుకోవడానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నడిచారు. అర్ధ రాత్రి కావటంతో ఇసుకలో నడుచుకుంటూ నీరు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అయితే ఆ యువతి నీటిలోని ఒక చెట్టును పట్టుకుని ఉండటాన్ని గమనించారు.

ఎస్సై రమేష్ వెంటనే సిబ్బందితో కలిసి నీటిలోకి దూకారు. ఆ యువతి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ యువతిని స్ట్రెచర్ పైకి చేర్చి రెండు కిలో మీటర్లు మేర నడిచి వారధి పైకి తీసుకొచ్చారు. అంతక ముందుగానే వారు 108 వాహానానికి ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారధిపై సిద్దంగా ఉన్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రాణి గారి తోటకు చెందిన యువతి కుటుంబ సభ్యులతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది. బ్రిడ్జిపై నుండి దూకిన సమయంలో నీరు తక్కువుగా ఉన్న నది పాయలో పడింది. దీంతో ఆమె స్వల్ప గాయాలతో బయట పడింది. అదే నీరు ఎక్కువుగా ఉన్నట్లయితే ఆమె ప్రాణానికే ముప్పు ఏర్పడి ఉండేదని పోలీసులు తెలిపారు. ఇలా సకాలంలో స్పందించి చిమ్మచీకట్లను సైతం దాటుకుంటూ నదిలో రెండు కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిన యువతిని కాపాడిన ఎస్సై రమేష్ అతని సిబ్బందిని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. అదే విధంగా యువతి ఆత్మహత్య యత్నం విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేసిన యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..