Ap Weather Alert: తీరాన్ని ఆనుకుని పయనిస్తున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో రాగల మూడురోజుల్లో వర్ష సూచన

|

Oct 07, 2021 | 2:59 PM

Ap Weather Alert తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన 'ఉపరితలద్రోణి' నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమల మీదుగా..

Ap Weather Alert: తీరాన్ని ఆనుకుని పయనిస్తున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో రాగల మూడురోజుల్లో వర్ష సూచన
Ap Weather
Follow us on

Ap Weather Alert తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘ఉపరితలద్రోణి’ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పయనిస్తుంది. దీంతో ఉపరితలద్రోణి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి ఏర్పడింది. దీంతో ఈనెల 10 వ తేదీన  ఉత్తర అండమాన్ సముద్రం నందు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం తదుపరి 4-5 రోజులలో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా,  ఉత్తర కోస్తాఆంధ్రా తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో  ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే.

ఉత్తర కోస్తా ఆంధ్ర-యానాం :

ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
‌ ‌రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో  కురిసే అవకాశం ఉంది.

Also Read:

‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. వైరల్ అవుతున్న సమంత ఓల్డ్ పోస్ట్..