గత ప్రభుత్వ అవినీతిపై ఏర్పాటు చేసిన ‘సిట్’పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తీర్పు ఊరట లభించింది. సిట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని గ్లీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా ఈ అంశంపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ‘సుప్రీంకోర్ట్’ ధర్మాసనం.. ‘స్టే’ విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని ఆ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాక హైకోర్టు తీర్పును, తీరును తప్పుబట్టి హైకోర్టు వెర్డిక్ట్‌ని రద్దు చేసింది.
కాగా, గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం ప్రస్తుతం ఉన్న ఏపీ సర్కార్ ‘సిట్’ని ఏర్పాటు చేసింది. అయితే దీన్ని వర్ల రామయ్య, ఆలపాటి రాజా వంటి పలువురు టీడీపీ నేతలు హైకోర్టులో సవాలు చేయగా.. విచారణ జరిపిన సదరు న్యాయస్థానం ‘సిట్’పై స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై బుధవారం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు స్టేని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..