బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం పాఠశాల విద్యార్దులు నాసా సైంటిస్టుతో మాట్లాడి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పాఠశాలలో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ హరిక్రిష్ణ పెన్‌పాల్ అనే కార్యక్రమాన్ని రూపొందించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న విద్యార్ధులతో వీడియో కాల్స్ సాయంతో మాట్లాడిచేవారు. గతంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్ధులతో వారి సంస్కృతి, సాంప్రదాయాలు భాష వంటి అంశాలపై ఐలవరం పాఠశాల విద్యార్ధులు మాట్లాడారు. టీచర్ హరిక్రిష్ణ నాసా శాస్త్రవేత్త హెన్రీ ట్రూప్‌తో మాట్లాడి తమ పాఠశాల విద్యార్ధులకు స్పైస్ టెక్నాలజీలో ఉన్న సందేహాలను తీర్చాలని కోరారు. సానుకులంగా స్పందించిన ఆమె ఐలవరం పాఠశాలలో ఎంపిక చేసిన విద్యార్ధులతో వీడియో కాల్ సాయంతో హెన్రీ ట్రూప్ ముచ్చటించారు.
విద్యార్ధుల ప్రశ్నలకు ట్రూప్ ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఏలియన్స్ మనుగడ, ఇతర ప్లానెట్స్ గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంట సేపు ట్రూప్‌కి విద్యార్ధలకు మధ్య సంభాషణ కొనసాగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్ధుల్లో సైన్స్‌పై మక్కువ పెరుగుతుందని టీచర్ హరిక్రిష్ణ చెప్పుకొచ్చారు.