Mangalagiri: ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు.. మహిళలకు మాయమాటలు చెప్పి
విజయవాడకు చెందిన బొమ్మిడి ఉమాదేవి, త్రినాథ్ దంపతులు ఓ పసికందును విక్రయిస్తున్నట్లు సమాచారం రాగా ఎస్పీ ఆదేశాలో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. 15 రోజుల పసిబిడ్డను రూ.5 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకుని పసికందును స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలో పసికందుల అమ్మకం ముఠా గుట్టురట్టు చేశారు మంగళగిరి పోలీసులు. విజయవాడకు చెందిన రమాదేవి, త్రినాథ్ దంపతులు శిశువును విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. కేసు గురించి మంగళగిరి సీఐ వినోద్ సంచలన విషయాలు చెప్పారు. విజయవాడకు చెందిన భార్యాభర్తలు రమాదేవి, త్రినాథ్ శిశువులను విక్రయించడమే తమ ప్రవృత్తి పెట్టుకున్నట్లు తెలిపారు. రమాదేవి హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ ఆసుపత్రులకు ఏజెంట్‌గా పని చేస్తోందని వివరించారు. పేద మహిళలను టార్గెట్ చేసి.. వారి డబ్బు ఆశజూపి.. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు ప్రొత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆ పిల్లల్ని.. సంతానం లేనివారికి భారీ మొత్తానికి విక్రయిస్తున్నట్లు మంగళగిరి పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. రమాదేవి, త్రినాథ్ దంపతులను అరెస్ట్ చేసిన పోటీసులు.. ఇద్దరు చిన్నారులను రెస్క్యూ చేసి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

