Razole: పొద్దున్నే మంచు.. మధ్యాహ్నం ఎండ.. రాత్రి అయితే చలి.. మన ఏపీలోనే

|

Apr 15, 2023 | 12:00 PM

ప్రజంట్ ఎండాకాలం. విపరీతమైన ఉక్కపోత ఉండటం కామన్. అకాల వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉదయాన్నే మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ అదరగొడుతుంది. రాత్రి అయితే చలి చంపేస్తుంది. విచిత్రంగా ఉంది కదూ...!

Razole: పొద్దున్నే మంచు.. మధ్యాహ్నం  ఎండ.. రాత్రి అయితే చలి.. మన ఏపీలోనే
Razole Weather
Follow us on

పొద్దున్నే మంచు..మధ్యాహ్నం ఎండ..రాత్రి అయితే చలి..ఇదీ రాజోలు దీవిలో వాతావరణం..మూడు సీజన్ల వాతావరణం అక్కడ ఒక రోజులోనే కనిపిస్తోంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వాతావరణంలో మార్పులు..పగలు వేసవి ఎండలకు ప్రజలు అల్లాడుతుంటే రాత్రుళ్లు చలి గాలులకు వణుకుతున్నారు..రాత్రి అయితే చాలు ఆకాశంలో ఎటు చూసినా మంచు దట్టంగా అలుముకుంటోంది..

అదే మధ్యాహాన్నం అయితే చాలూఎండలు, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..ఎండలకు తోడు వేడి గాలులతో జనాలు అల్లాడిపోతున్నారు..ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి..ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను అంకితం అవ్వుతున్నారు..

మరీ అదే రాత్రి అయితే చాలూ చలి చంపేస్తోంది..పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రాత్రి చలి మాత్రం అలాగే కొనసాగుతుంది..మరోవైపు వేకువజామున పొగమంచు దట్టంగా ఏర్పడుతోంది. సూర్యాస్తమయం తరువాత కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఎప్పుడూ, ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వేసవి కాలంలో మంచు కప్పుకోవడంతో ప్రకృతి వింత అంటున్నారు రాజోలు దీవి ప్రజలు.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..