AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల్లోగా అన్నిఫలితాలను ప్రకటించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ సమస్యలేకుండా చూడాలని, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్, వీడియో లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని అన్నారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ పుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. పది కంటే తక్కువ మెజార్టీ సాధించిన సమయంలో మాత్రమే నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్‌కు అనుమతించాలని అన్నారు. అయితే రెండంకెల మెజార్టీ వచ్చినచోట అభ్యర్థి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బంది నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు ఉన్నారు. కౌంటింగ్ వద్ద 1345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, ఇతరులు 1,134 మందిని ఏర్పాటు చేశారు.
Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి