ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంగ్ ఆఫ్ ఇండియా(State Bank of India ) కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం, ఆదివారం కూడా తెరిచి ఉంటాయని వెల్లడించింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఎస్‌బీఐ(SBI) బ్యాంకులు పనిచేస్తాయని ఆ సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. బ్యాంకులకు సెలవు దినాలైనప్పటికి 26న నాల్గవ శనివారం, 27న ఆదివారం ప్రజల ప్రయోజనార్థం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తమ 52 బ్రాంచీలు పనిచేస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. ఈ మేరకు ఓ ఎస్బీఐ కీలక ట్వీట్ చేసింది. ఏపీలోని 52 బ్యాంకు శాఖలు రేపు, ఎల్లుండి తెరిచే ఉంటాయని ఎస్‌బీఐ తెలిపింది.
రిజిస్ట్రేషన్ ఫీజులు, సంబంధిత స్టాంప్ డ్యూటీ/చలాన్ల కోసం బ్రాంచ్‌లను తెరిచి ఉంచుతున్నట్టు పేర్కొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తి మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో (శని, ఆదివారం)లో తెరిచి ఉండే బ్రాంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..