Andhra News: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం.. 

| Edited By: Velpula Bharath Rao

Dec 18, 2024 | 9:01 AM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. విదేశీ కరెన్సీ హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. రూ.5,96,92,376 కోట్ల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారు.

Andhra News: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం.. 
Srisailam Mallanna Temple Hundi Counting
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.5,96,92,376 కోట్లతో నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.

ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 232 గ్రాముల 400 మిల్లి గ్రాముల బంగారం అలానే వెండి 7 కేజీల 850 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 558, సౌదీఅరేబియా రియాల్స్ 3, ఓమన్ బైసా – 200, కువైట్ దినార్ 12, కత్తారు రియాల్స్ 4, సింగపూర్ డాలర్లు 7, ఆస్ట్రేలియా డాలర్లు 60, కెనడా డాలర్లు – 35, హాంకాంగ్ డాలర్లు 10, యూకే ఫౌండ్స్ 5, ఈరోస్ 115, కెన్యా షిల్లింగ్స్ 50, ఫిలిపిన్స్ పిసో 20, యూఏఈ దిర్హమ్స్ 15, జాంబియా క్వచ 20, జపాన్‌యన్స్ 1000 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి