Srisailam: ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి.. ఊపిరి పీల్చుకున్న శ్రీశైలం వాసులు, భక్తులు..

|

Jan 15, 2022 | 9:09 AM

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో గత కొన్ని రోజులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ఎలుగుబంటిని

Srisailam: ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి.. ఊపిరి పీల్చుకున్న శ్రీశైలం వాసులు, భక్తులు..
Follow us on

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో గత కొన్ని రోజులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. స్థానికంగా నివసిస్తోన్న చెంచు గిరిజనుడు ముగన్న పొలంలో బోన్ ఏర్పాటుచేసి దానిని బంధించారు. కాగా కొద్దిరోజులుగా జనవాసాల్లోకి వచ్చి భయపెడుతోన్న ఎలుగుబంటిని పట్టుకోవడంతో అటు స్థానికులతో పాటు భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇటీవల శ్రీశైలం మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తూ స్థానికులను, భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సున్నిపెంట, దోమలపెంట ప్రాంతాల్లో అర్ధరాత్రి ఎలుగుల సంచారంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈక్రమంలోనే తమ ఇబ్బందులను అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కాగా సున్నిపెంట చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గ్రామం నుంచి ఎలుగుబంట్లను తరిమేందుకు తీవ్రంగా శ్రమించారు. టపాసులు కాలుస్తూ ఎలుగుబంట్లను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రెండు ఎలుగుబంట్లు మాత్రం తిరిగి జనావాసాలలోకి వస్తుండడంతో వాటిని పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ గిరిజనుడి పొలంలో బోనును ఏర్పాటుచేశారు. అందులో ఎలుగుబంటి చిక్కుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read:Warangal: మిర్చి రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన పంట..

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా డబుల్‌ ప్రాఫిట్‌.. పిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ.. ఎలాగంటే..?

FTC vs Meta: కోర్టులో మెటా కంపెనీకి చుక్కెదురు.. ఫేస్‌బుక్ ఆ రెండు యాప్ లను వదులుకోవాల్సిందేనా?