Sri Satyasai District: ఏపీలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ ( Collector Basanth Kumar) బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ద్విచక్ర వాహనంపై వెళ్లి కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు, నీడ,నీరు వంటి సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో లోటుపాట్లు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పని వేళలు కూడా అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా చూడాలని, పని కల్పించాలని కోరిన ప్రతి కూలీకి పని చూపాలని సూచించారు. రైతులు ఫారం పాండ్ తవ్వకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఫారం పాండ్ లను తవ్వుకుంటే ఒనగూరే ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధి పై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు..
Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!