శ్రీలంకలో(Sri Lanka) రగులుతోన్న రావణకాష్టం.. ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆందోళనలతో లంక అట్టుడుకుతుంటే, ఏపీలో సెగలు రేగుతున్నాయి. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి, ఆంధ్రప్రదేశ్‌కూ లింకేంటి? ఏపీ పొలిటికల్ కాన్వాస్‌పై లంక ఎందుకు సీన్ క్రియేట్ చేస్తోంది. లంక దుర్భర పరిస్థితులను, ఏపీలో పరిణామాలతో పోల్చుతూ జగన్ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీడీపీ(TDP), జనసేన, బీజేపీ, వామపక్షాలు అందరికీ ఒకటే మాట. ఆంధ్రప్రదేశ్, మరో శ్రీలంక మారబోతోందని. లంకలో నెలకొన్న పరిస్థితులే ఏపీలో రాబోతున్నాయంటున్నారు టీడీపీ లీడర్ బోండా ఉమ(Bonda Uma) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ వీర బాదుడు బాదుతున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరి నుంచి పన్నులు వసూలుచేసి 30శాతం మందికి పంచితే, మిగతా 70శాతం ఏమైపోవాలని ప్రశ్నించారు.
మరోవైపు.. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న సానుకూల దృక్పథాన్ని జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్‌ను శ్రీలంకతో పోలుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీ లంకలా మారాలని, అక్కడి ప్రజల్లా ఆంధ్రులు కూడా కష్టాలు పడాలని టీడీపీ, జనసేన కోరుకుంటున్నాయని రివర్స్ ఎటాక్ చేశారు. వ్యవస్థలను నాశనం చేస్తే, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఆ తర్వాత వచ్చేది ఆర్ధిక మాంద్యమే అని విపక్షాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోందని, ఇదే కంటిన్యూ అయితే ఏపీ, మరో శ్రీలంకలా మారడం ఎంతో దూరంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై వేల కోట్లు భారం వేసిందని చంద్రబాబు విమర్శించారు. సోమవారం నుంచి మొదలైన నిరసనలను గ్రామ, మండల స్థాయిలో ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్తు ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు, పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెంచిన పన్నుల కారణంగా ప్రతి ఇంటిపై రూ. లక్షా పదివేల చొప్పున భారం పడుతోందన్నారు. జగన్ విధానాల వల్లే రాష్ట్రంలో కరెంట్ కొరత, కోతలు ఉన్నాయని ఆక్షేపించారు. ప్రిజనరీ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక కాబోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
ICC ODI Ranking: విరాట్ కోహ్లీకి షాకిచ్చిన పాకిస్తాన్ సారథి.. భారీ తేడాతో అగ్రస్థానంలోకి..
MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ అరెస్ట్.. మంత్రి కేటీఆర్ సూచనతో స్పందించిన పోలీసులు
Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..