
అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు తెలంగాణ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. సంక్రాంతికి హైదరాబాద్ నుండి కొనసీమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్ నుండి అమలాపురంకు 57 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు అమలాపురం రిజనల్ మేనేజర్ నాగేశ్వరరావు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్‌గా 19 బస్సులు కాకుండా 57 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచుతామన్నారు. సంక్రాంతి అంటే వివిధ ప్రాంతాల నుంచి కోనసీమకు ఎక్కువగా వస్తారన్న కారణంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
వచ్చేటప్పుడు – వెళ్ళేటప్పుడుకి ఒకేసారి రిజర్వేషన్ చేయించుకుంటే 10% శాతం రాయితీ కూడా పొందవచ్చని తెలిపారు. కేవలం కోనసీమకే కాకుండా హైదరాబాద్ నుంచి ఏపీలో ఏ ప్రాంతానికైనా రాను పోను బుక్ చేసుకుంటే ఈ 10శాతం డిస్కౌంట్ ను పొందవచ్చన్నారు. 10,11,12,13 తేదీలలో బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అమలాపురం నుండి రాజమండ్రి, కాకినాడ, విశాఖకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిమాండును, సందర్భాన్ని, పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకునే ప్రవేట్ ట్రావెల్స్‌లో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకుండా ఏపీఎస్ ఆర్టీసి సేవలు వినియోగించుకోమని అమలాపురం రిజనల్ మేనేజర్ నాగేశ్వరరావు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..