South Central Railway: రైలు పట్టాల మరమ్మతులకు తోడు ఆధునీకరణ పనుల కారణంగా తిరుపతి- చెన్నై మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఇంకొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, రీషెడ్యూల్ చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి- చెన్నైసెంట్రల్ (ట్రైన్ నంబర్16054), చెన్నై సెంట్రల్- తిరుపతి (రైలు నంబర్16053) రైళ్లను ఈ మే 17, 18, 24, 26, 31 జూన్ 1, 7, 8 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా నెల్లూరు – సుళ్లూరుపేట మధ్య తిరిగే మెమూ (ట్రైన్ నంబర్ 06746), సుల్లూరుపేట- నెల్లూరు మెమూ (ట్రైన్ నంబర్06745) రైళ్లను ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
విజయవాడ- చెన్నై సెంట్రల్ ( ట్రైన్ నంబర్ 12711), చెన్నై సెంట్రల్ – విజయవాడ( ట్రైన్ నంబర్ 12712) రైళ్లను, గూడూరు- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్- గూడూరు మధ్య తిరిగే రైళ్లను ఈనెల 24 పాక్షికంగా రద్దు కానున్నాయి. ఇక పుదుచ్చేరి- ఢిల్లీ (రైలు నంబర్ 22403) రైలును జూన్1న, ధనాపూర్- బెంగళూరు (12296) మే15, 16, 22, 23, 29,30, జూన్ 5,6 తేదీల్లో దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా చెంగల్పట్ట, అరక్కోణం, పెరంబూరు, కొరుక్కు పేట, గుడూరు, రేణిగుంట, తిరుత్తణి, మేల్పాకం తదితర స్టేషన్ల మీదుగా తిరిగే రైళ్ల రాకపోకల్లోనూ మార్పులుంటాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించాలని SCR పేర్కొంది.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..