Sonu Sood: ఆంధ్రా​ నుంచే ఆరంభం.. సోనూ సూద్ తొలి ఆక్సిజన్​ ప్లాంటు ఏపీలోనే

|

May 22, 2021 | 6:09 PM

రియ‌ల్ హీరో, దేవుడు... ప్ర‌స్తుతం న‌టుడు సోనూ సూద్‌ను ఇదే పేర్ల‌తో పిలుచుకుంటున్నారు జ‌నాలు. సాయం అంటే చాలు ఎగ‌బ‌డి వ‌చ్చేస్తున్నాడు ఈ యాక్ట‌ర్. త‌న‌కు అయినంత‌లో....

Sonu Sood: ఆంధ్రా​ నుంచే ఆరంభం.. సోనూ సూద్ తొలి ఆక్సిజన్​ ప్లాంటు ఏపీలోనే
Sonusood
Follow us on

రియ‌ల్ హీరో, దేవుడు… ప్ర‌స్తుతం న‌టుడు సోనూ సూద్‌ను ఇదే పేర్ల‌తో పిలుచుకుంటున్నారు జ‌నాలు. సాయం అంటే చాలు దేశంలోని ఏ ప్రాంత‌మైనా ఎగ‌బ‌డి వ‌చ్చేస్తున్నాడు ఈ యాక్ట‌ర్. త‌న‌కు అయినంత‌లో అప‌న్న హ‌స్తం అందిస్తున్నాడు. అత్య‌వ‌స‌రం అయితే జోలె ప‌ట్టి అడిగి (సోనూ సూద్ ఫౌండేష‌న్) మ‌రీ మ‌నుషుల ప్రాణాలు కాపాడుతున్నాడు. క‌రోనా లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​.. తన ఆధ్వర్యంలోని తొలి సెట్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్ల‌డించారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివ‌రించారు.

సోష‌ల్ మీడియా వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్​ కాన్సట్రేటర్​లను అందించారు సోనూసూద్. ఇవి సరిపోకపోవడం వల్ల ఫారెన్ నుంచి ఆక్సిజన్​ ప్లాంట్లను తెప్పించేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

Also Read:  సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..

యంగ్ హీరో నో అంటేనే ఆ సినిమా కథ వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట..