Snake Bite: పాము అంటేనే అందరికి వణుకుపుడుతుంది. పాము కనిపిస్తే చాలు పరుగులు పెడతారు. కానీ పాము (Snake) అంటే ఆ కటుంబ వణికిపోతుంది. 45 రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురికి ఆరుసార్లు కాటేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి (Chindragiri) మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లిలో ఆది ఆంధ్రవాడకు చెందిన ఓ కుటుంబాన్ని ఓ పాము పట్టి పీడిస్తోంది. వెంకటేష్ తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్, తండ్రితో కలిసి అటవీ ప్రాంతంలో వ్యవయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తుండగా అతడి కాలుపై పాము కాటేసింది. దీంతో 108కి సమాచారం అందించడంతో అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే వెంకటేష్‌కు గతంలో రెండుసార్లు, తండ్రి, భార్య, కుమారుడికి ఒక్కోసారి పాము కాటేసింది. ఇప్పుడు తాజాగా జగదీష్‌ను మరోసారి కాటేసింది. తమ కుటుంబాన్ని పాము వేధించడం వారు భయాందోళనకు గురవుతున్నారు. అయితే 45 రోజుల్లో ఒకే కుటుంబాన్ని అన్ని సార్లు కాటేయడం పాము పగబట్టిందని గ్రామస్తులు చెప్పుకొంటున్నారు. కానీ పాములు పగబట్టడం లాంటివేమి ఉండవని మరి కొందరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: