గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

కాకినాడ – లింగంపల్లి మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్‌లో పొగలు వచ్చాయి. కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏలూరు స్టేషన్‌కు సమీపిస్తుండగా.. ఎస్ 1 బోగి నుంచి పొగలు వచ్చినట్లు సమాచారం. ఇవాళ రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. ఈ పొగలను చూసిన ప్రయాణికులు భయాందోళనలు చెందగా.. హుటాహుటిన టీసీ, మెకానిక్‌లు అక్కడికి చేరి సమస్యను పరిష్కరించారట. ట్రైన్‌ను సీతపేట స్టేషన్ వద్ద […]

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

Updated on: Oct 10, 2019 | 11:39 PM

కాకినాడ – లింగంపల్లి మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్‌లో పొగలు వచ్చాయి. కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏలూరు స్టేషన్‌కు సమీపిస్తుండగా.. ఎస్ 1 బోగి నుంచి పొగలు వచ్చినట్లు సమాచారం. ఇవాళ రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. ఈ పొగలను చూసిన ప్రయాణికులు భయాందోళనలు చెందగా.. హుటాహుటిన టీసీ, మెకానిక్‌లు అక్కడికి చేరి సమస్యను పరిష్కరించారట. ట్రైన్‌ను సీతపేట స్టేషన్ వద్ద సుమారు 10 నిమిషాలు నిలపగా.. కొద్దిసేపటికి సమస్య సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

దసరా పండుగ ముగియడంతో ప్రజలందరూ తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణీకులు అధికంగా ట్రైన్ల మీద ఆధారపడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి.