Andhra Pradesh: పసిబిడ్డ ప్రాణం తీసిన మద్యం మత్తు.. మందు తాగిన ఆ తండ్రి ఏం చేశాడంటే..?

| Edited By: Janardhan Veluru

Jun 03, 2023 | 2:21 PM

మద్యం మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటయపాలెంలో..

Andhra Pradesh: పసిబిడ్డ ప్రాణం తీసిన మద్యం మత్తు.. మందు తాగిన ఆ తండ్రి ఏం చేశాడంటే..?
Representative Image
Follow us on

మద్యం మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటయపాలెంలో వేమూలూరి గాంధీ, భార్య వ్యవసాయ కులీ పని చేసుకునేవారు. మద్యం తాగే అలవాటు ఉన్న గాంధీ రోజూ అలవాటులానే పని ముగించుకొని తాగి ఇంటికి వచ్చి సేదతీరేందుకు మంచంపై పడుకున్నాడు.

అయితే అదే మంచంపై నిద్ర పోతున్న తన కూతురు దివ్య(6 నెలలు)ను గమనించకుండా చిన్నారిపై పడుకోవడంతో.. పాప అపస్మారక స్థితికి చేరకుంది. అంతా జరిగిపోయాక గమనించిన గాంధీ భార్య వెంటనే తన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ మార్గమధ్యంలోనే ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..