Draksharamam: శివలింగం ధ్వంసం కేసులో కీలక అప్ డేట్… అందుకే చేశాడట..!

ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో కోనేటి శివలింగం ధ్వంసం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. అర్చకుడిపై కోపంతోనే శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు అనుమానితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. CC ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Draksharamam:  శివలింగం ధ్వంసం కేసులో కీలక అప్ డేట్... అందుకే చేశాడట..!
Shiva Lingam Vandalised

Updated on: Dec 31, 2025 | 11:44 AM

ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.  పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వరస్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు.పోలీసుల తోటపేటకి చెందిన 38 ఏళ్ల శీలం శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకున్నారు.  CC ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరినీ విచారించినా తోటపేట యువకుడిని గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకున్నట్టు సమాచారం. భీమేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో ఆ యువకుడికి, పూజారికి మధ్య పలుమార్లు గొడవ జరిగిందని తెలుస్తోంది.పూజారిపై కోపంతోనే శివలింగం ధ్వంసం చేసినట్లు అతను చెప్తున్నాడంటున్నారు. మంగళవారం ఈ విషయం వెలుగుచూడగానే CM చంద్రబాబు కూడా ఆరా తీశారు.  జిల్లా SP కూడా వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డాగ్‌ స్క్వాడ్‌ కూడా రప్పించారు. CC ఫుటేజ్‌లు కూడా పరిశీలించాక కొందర్ని విచారించారు. తర్వాత శ్రీనివాస్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పురానతనమైన ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నాయి.

పంచారామాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగా చెప్పే ఈ ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి 11 వందల ఏళ్ల చరిత్ర ఉంది. మంగళవారం దెబ్బతిన్న శివలింగం స్థానంలో కొత్తది పునఃప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పానవట్టంపైన ఉన్న లింగాకారాన్ని ప్రతిష్ఠించి పూజాదికాలు పూర్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.