AP Rains: వరుస అల్పపీడనాలు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Jul 15, 2024 | 1:37 PM

వాయువ్య దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు..

AP Rains: వరుస అల్పపీడనాలు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us on

వాయువ్య దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, సంబల్పూర్, పూరి గుండా వెళుతూ.. ఆగ్నేయ దిశగా వాయువ్య, ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది.

ఒక షీర్ జోన్ లేదా గాలుల కోత సగటు సముద్రానికి ఎగువన 3.1 & 7.6 కి.మీ మధ్య దాదాపు 20°N వెంబడి విస్తరించి ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. జూలై 19న పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై వేరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నిన్నటి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ & దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్ & ఓడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఈరోజు తక్కువగా గుర్తించబడింది.

ఇది చదవండి: పెదవుల ఆకారం మీ స్వభావం, వ్యక్తిత్వాన్ని చెబుతుందట.. ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

—————————————-
రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటిర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఇది చదవండి: మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా.. ఈ లక్షణాలు కనిపిస్తే

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటిర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-
—————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..