రతనాల సీమలో రక్తపాతం.. మహిళలే లక్ష్యంగా దారుణాలు.. హత్యకు కారణాలివే..

| Edited By: Srikar T

Jul 13, 2024 | 10:00 AM

రాయలసీమ జిల్లాల్లో హింస కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. మొన్న ఆళ్లగడ్డలో శ్రీదేవి దారుణహత్యకు గురైతే.. నేడు ఆదోనిలో గుండమ్మ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ హత్య. అడ్డు వచ్చిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

రతనాల సీమలో రక్తపాతం.. మహిళలే లక్ష్యంగా దారుణాలు.. హత్యకు కారణాలివే..
Kurnool District
Follow us on

రాయలసీమ జిల్లాల్లో హింస కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. మొన్న ఆళ్లగడ్డలో శ్రీదేవి దారుణహత్యకు గురైతే.. నేడు ఆదోనిలో గుండమ్మ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ హత్య. అడ్డు వచ్చిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుండమ్మ అనే మహిళపై ట్రాక్టర్‎తో దాడి చేశారు. గుండమ్మ తరపున మద్దుతు వచ్చిన పురుషోత్తమ రెడ్డిపై కూడా దాడికి పాల్పడి పారిపోయారని హత్యకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆదోని ఆసుపత్రి సిబ్బది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ జనరల్ హాస్పిటల్‎కు తరలించారు. హత్య గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టేదే లేదన్నారు.

నాగనాథ హలీ గ్రామంలో పొలం విషయంలో పురుషోత్తం రెడ్డి, గుండమ్మతో పాటూ.. ఆదే గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అతని కొడుకు శ్రీధర్ రెడ్డికి భూ తగాదాలు ఉన్నట్లు ఆదోని డీఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాఘవేందర్ రెడ్డి అతని కొడుకు శ్రీధర్ రెడ్డి పొలంలో ట్రాక్టర్‎తో గుద్ది గుండమ్మను చంపేశారని వివరించారు. పురుషోత్తం రెడ్డిని కూడా కట్టెలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆయన ప్రస్తుతం కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాట్లు చెప్పారు. గుండమ్మ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపారు. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో వరుస హత్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఇటీవల ఆళ్లగడ్డలో అట్ల శ్రీదేవి అనే మహిళను కళ్ళలో కారంపొడి కొట్టి.. కర్రలు, రాడ్లతో దాడిచేసి చంపారు. ఇది కూడా ఆస్తితగాదాలే కావడం గమనార్హం. ఇవన్నీ కక్షలు కాదని, కేవలం ఇళ్లు, భూముల వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి స్పష్టం చేశారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..