ఈ నియోజకవర్గాల్లోనే ముందుగా తుది ఫలితం..కౌంటింగ్‌పై ఈసీకి కీలక ఆదేశాలు..
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై చేపట్టాల్సిన కార్యచరణను వివరించారు. ఈనెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నాయకుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదే ననే ధీమాలో ఉన్నారు నేతలు. ఇంతటి నరాలు తెగే ఉత్కంఠకు తెరవేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై చేపట్టాల్సిన కార్యచరణను వివరించారు. ఈనెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నాయకుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదే ననే ధీమాలో ఉన్నారు నేతలు. ఇంతటి నరాలు తెగే ఉత్కంఠకు తెరవేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ముందుగా పోస్టల్ బ్యాలెట్లపై ఫోకస్ పెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నింటికంటే కీలకం కానున్నాయి. పైగా వీటిని లెక్కించేందుకు సమయం ఎక్కువ పడుతుంది. అందుకే ఈసీ ముందస్తుగా దీని కోసం కౌంటింగ్ టేబుళ్లను పెంచింది. తద్వారా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టింది.
దీంతో పాటు ఈవీఎంల విషయంలోనూ ప్రత్యేక శద్ద చూపించినట్లు తెలుస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల చొప్పున ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఫలితాలు వెల్లడించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అలాగే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. అయితే మూడు నియోజకవర్గాల్లో మాత్రం 25 రౌండ్లకుపైగా లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అందుకే ఇక్కడ ఫలితాలు కొంచెం ఆలస్యంగా సాయంత్రం 6 గంటల్లోగా వెలువడే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య తుది ఫలితాలు వెలువడే విధంగా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




