Amaravathi: ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యంగ విరుద్ధం అని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంపై ఎస్ఈసీ రమేష్ ఏపీ గవర్నర్కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు సమాన అధికారాలు ఉంటాయని పేర్కోన్నారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకువస్తే దాన్ని తిరస్కరించాల్సిందిగా గవర్నర్ను ఎస్ఈసీ కోరారు. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్.