Andhra News: దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

| Edited By: Velpula Bharath Rao

Dec 25, 2024 | 9:31 PM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరప్రాంతంలో తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పాంగి, అల్లకల్లోంగా మారినప్పుడల్లా తీరప్రాంతాలకు చెందిన మత్స్యకార పిల్లలు,పెద్దలు బంగారు రజను కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఒక్కొక్కరు ఒక్కొక దువ్వెన పట్టుకొని, కెరటాలు ఒడ్డుకు వచ్చి లోపలకు వెళ్ళిన సమయంలో ఇసుకపై దువ్వెనతో ఇసుకపై గీస్తారు.

Andhra News: దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
Gold
Follow us on

ఒకవైపు తుఫాను వచ్చిన ప్రతిసారీ పదుల సంఖ్యలో ఇళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే మరోవైపు ప్రతి సంవత్సరం లాగే ఆనవాయితీగా సముద్ర తీరంలో బంగారం కోసం వేట సాగిస్తుంటారు ఇక్కడ మత్స్యకారులు.. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరప్రాంతంలో తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పాంగి, అల్లకల్లోంగా మారినప్పుడల్లా తీరప్రాంతాలకు చెందిన మత్స్యకార పిల్లలు,పెద్దలు బంగారు రజను కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఒక్కొక్కరు ఒక్కొక దువ్వెన పట్టుకొని, కెరటాలు ఒడ్డుకు వచ్చి లోపలకు వెళ్ళిన సమయంలో ఇసుకపై దువ్వెనతో ఇసుకపై గీస్తారు. ఇలా గీకడం ద్వారా ఇసుక లోపల నుంచి మినుకుమినుకు మంటూ చిన్నచిన్న బంగారు రజను మత్స్యకారుల కంట పడుతుంది. దీంతో మళ్ళీ సముద్రంలో కెరటం ఒడ్డుకు వచ్చేలోపు ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి తీస్తారు. ఇలా ఒడ్డును ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత బంగారు రజనను దక్కించుకోవడం జరుగుతుంది.

ఉదయం నుంచీ సాయంత్రం వరకు ఒక్కక్కరూ కనీసం రూ. 500ల నుంచి 800 రూపాయల వరకు బంగారు రజను సేకరిస్తామని మత్స్యకారులు తెలుపుతున్నారు.  పూర్వకాలం ఇక్కడో మహానగరం ఉండేదని అప్పట్లో సముద్రం ఉప్పొంగి నగరం సముద్రగర్భంలో కలిసిపోయిందని, సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇసుకలో ఉన్న బంగార ముక్కలు, ఇసుక రాపిడికి రజనుగా మారి ఒడ్డుకు చేరుతుందనే కథను మరికొందరు మత్స్యకారులు చెప్తుంటారు. ఏది ఏమైనా కాకినా కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమీ గూడి బంగారు రచన కోసం మత్స్యకారులు జల్లెడ పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి