Vizag: వల వేసిన జాలర్లు.. చేపలతో పాటు ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథులు

విశాఖ తీర ప్రాంతం.. రుషికొండ బీచ్ సమీపంలో మత్స్యకారులు ఎప్పటిలాగానే వేటకు వెళ్లారు... చేపలు బాగా పడాలని గంగమ్మకు మొక్కి వల విసిరారు.. చేపల పట్టేందుకు శ్రమించారు.. చేపలు అయితే చిక్కాయ్..! కానీ వాటితోపాటు.. ఊహించని అతిథులు కూడా వలలో కనిపించాయ్. అవెంటో తెలుసుకుందాం పదండి...

Vizag: వల వేసిన జాలర్లు.. చేపలతో పాటు ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథులు
Fishing (representative image)

Edited By: Ram Naramaneni

Updated on: Feb 06, 2025 | 1:12 PM

మత్స్యకారులు చేపల కోసం సముద్రంలో.. వలవేశారు. చిక్కిన చేపలతో తీరానికి వచ్చేసారు.. చేపలన్ని వల నుంచి వేరు చేసే క్రమంలో.. వాళ్లకు షాక్.. ఎందుకంటే ఆ వలలో పాములు కనిపించాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు..! సముద్రంలో పాములు ఏంటి అనేగా మేము ఆలోచన..?! అవును సముద్రంలో కూడా పాములు ఉంటాయి. వాటిని సీ స్నేక్స్‌గా పిలుస్తారు. ఇవి విషపూరితమైనవే.. ఆహార అన్వేషణలో భాగంగా చిన్నచిన్న చేపలను వేటాడుతూ తింటుంటాయి. ఇలా చేపలు ఉన్నచోటకు వస్తూ.. వలలో చేపలతో  పాటు కొన్నిసార్లు అవి కూడా చిక్కుతాయి. మత్స్యకారులు చేపలను వేటాడే క్రమంలో ఇలా సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తుంటాయి. వీటిని గుర్తించిన మత్స్యకారులు తిరిగి సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు.

Sea Snake

వాస్తవానికి ఈ పాములను హైడ్రోఫిస్ లాపే మోయిడ్స్ అనేది శాస్త్రీయ నామం. ఈ జాతి భారత్ తో పాటు బంగ్లాదేశ్, బహ్రయిన్, మలేషియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ తీర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని శరీరం పసుపు, ఆలివ్, బుడిద రంగులో ఉంటుంది. ఈ పాము చేపలను వేటాడి తింటుంది. మత్స్యకారులు చేపలను వేటాడే క్రమంలో బైక్యాచ్ గా వలకు చిక్కుతుంది. సి స్నేక్ లో చాలా రకాల జాతులు ఉన్నాయి. ఇవి విషపూరితం. కాటేస్తే ప్రమాదకరమని అంటున్నారు సముద్ర శాస్త్రవేత్తలు.

Snake

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..