Jawad Cyclone Updates: జొవాద్ తుఫాన్ తీర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ సహా ఒడిశా పలు రాష్ట్రాల్లో భారీగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాన్ వాయుగుండంగా మారనుండటంతో అన్ని తీర ప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేశారు. జొవాద్ తుఫాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం సాయంత్రం వెల్లడించింది. ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 5న (ఆదివారం) బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్- విశాఖపట్నం (18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్ (20890), భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (22819), భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ (12663), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845) రైళ్లు రద్దు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
వీటితోపాటు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే తెలిపింది. అలెప్పీ-ధన్బాద్, న్యూ జల్పాయిగురి-చెన్నై సెంట్రల్, సిల్ఘాట్ టౌన్-తాంబారం రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ షెడ్యూల్ ను ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచించింది.
Bulletin No. 07 & 08 “Cancellation & Diversion of Trains due to Cyclone “JAWAD” #JawadCyclone #TrainUpdates @VijayawadaSCR pic.twitter.com/8mYW6IrDwZ
— South Central Railway (@SCRailwayIndia) December 4, 2021
Also Read: