AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Kodi Pandalu: ఒక్కో పుంజుకు లక్షల్లో ఖర్చు.. కోడి పందాలకు వెళ్లాలంటే ‘కుక్కట శాస్త్రం’ తెలియాల్సిందే..!

Sankranti Kodi Pandalu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు....

Sankranti Kodi Pandalu: ఒక్కో పుంజుకు లక్షల్లో ఖర్చు.. కోడి పందాలకు వెళ్లాలంటే 'కుక్కట శాస్త్రం' తెలియాల్సిందే..!
Subhash Goud
| Edited By: |

Updated on: Jan 07, 2021 | 7:14 AM

Share

– పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ

– లక్షల్లో ఖర్చు

– ఒక్కో పుంజుకు రోజుకు దాదాపు రూ. 400 వరకు ఖర్చు

– ఒక్కో పందెం కోడి ధర రూ. లక్ష వరకు

Sankranti Kodi Pandalu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు. సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. అయితే పండగకు ఐదు నెలల ముందు నుంచే కోడి పందాలకు సిద్ధమవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పందెం కోళ్ల శిక్షకులు తెలిపిన వివరాల ప్రకారం..

పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ

ఇక ఏపీలోని పలు జిల్లాలోని కొన్ని గ్రామాలు సంక్రాంతి కోడిపందాలకు రెడీ అవుతున్నారు. పందెం కోళ్లను ప్రతి రోజు ముగ్గురు సంరక్షించుకుంటారు. పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే.. పందాలపై ఏమేరకు ఆసక్తి చూపుతారో ఇట్టే అర్థమైపోతుంది. ఉదయాన్నే ఐదు గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లటి గాలి శ్వాస తీసుకునేలా చేసి చుట్టు వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలి పెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు అలసిపోవడంతో పాలల్లో నానబెట్టిన బాదం పిస్తా, ఖర్జురా, కిస్‌మిస్‌లను పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తారు. పందెం కోళ్లను తయారు చేయడంలో వారు తీసుకునే శ్రద్దను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. కోడి పుంజులు పందెలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా తయారు చేస్తారు.

కోడి పుంజుల్లో రకాలు

పందెలకు రెడీ చేసే కోడి పుంజుల్లో కూడా చాలా రకాలుంటాయి. వాటిలో గౌడ నెమలి, తెల్లనెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. వీటిలో తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులు ఎంతటి పందెంనైనా నెగ్గే శక్తి ఉంటుందట. ఒక్కో పుంజు ఖర్చు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. పందెలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్ష ఇచ్చి పందెలలో తట్టుకునే విధంగా శిక్షణ ఇస్తారు.

పందెం కోళ్లకు లక్షల్లో ధర

అయితే పూర్తి స్థాయిలో కోడి పుంజులు పందేలకు సిద్ధమైన తర్వాత ఒక్కో పుంజుకు లక్షల్లో ధర పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే పుంజులకు చాలా గిరాకీ ఉంటుందని చెబుతున్నారు.

కోడి పందేలకు కుక్కుట శాస్త్రం..

కోడి పందేల్లో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇక పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేస్తారు. ఆ రోజు ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగున్న పుంజును మాత్రమే పందెంలోకి దించుతారని శిక్షకులు చెబుతున్నారు.

13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలికి చెందిన పుంజులు పందాలలో విజయం సాధిస్తాయట. 14న కాకి నెమలి, పసి మగల్ల కాకి పుంజులు, కాకిడేగలకు చెందిన పుంజులు గెలుపొందుతాయని, అలాగే 15న డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో విజయం సాధిస్తాయని కోడిపందాల్లో ప్రావీణ్యం ఉన్నవారు వివరిస్తున్నారు.

Coronavirus: గాలిలో 2 గంటల పాటు కరోనా వైరస్‌..సీసీఎంబీ, ఐఎంటెక్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడి