
సంక్రాంతి వచ్చిందంటే చాలూ ప్రతి ఒక్కరూ గోదావరి జిల్లాల బాటపడుతారు. ఎందుకంటే అక్కడ సంక్రాంతి పండుగ అంత అద్భుతంగా జరుగుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్లు సైతం సంక్రాంతి ఫెస్టివల్‌కు ఇంటికి రావాల్సిందే. ఈ గోదావారి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలు ఎంత ఫేమసో.. అక్కడ దొరికే నాటు కోడికూర కూడా అంతే ఫేమస్. పండగకు ఇంటికొచ్చే కొత్త అల్లుళ్లతో పాటు అతిథులకు నాటు కోడితో రకరకాల వంటకాలను చేసి పెట్టడం అక్కడి ప్రజల ఆనవాయితీ. అదే కాకుండా మూడు రోజులు సంక్రాంతి పండులో కీలకమైన ముక్కనుమ రోజు అక్కడి ప్రజలు స్థానిక గ్రామదేవతలకు నాటుకోడిని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే గోదావరి జిల్లాల్లో నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది.
ఇక సంక్రాంతి పండగా దగ్గర పడిన నేపథ్యంలో గోదావరి జిల్లాలో నాటు కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు అక్కడ నాటు కోళ్ల కొరత ఉంది. దీంతో ఒక్క కోడి కోసం సుమారు 10 నుంచి 20 మంది దాకా పోటీ పడుతున్నారు. దీంతో నాటుకోళ్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కేజీ నాటుకోడి ధర రూ.2000 నుంచి రూ. 2500 వరకు పలుకుతోంది.
అయితే సంక్రాంతికి విదేశాలు, ఇతర దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చే బంధువులు ఊర్లోని కుటుంబ సభ్యులు ముందుగానే మెను కోరుతున్నారు. అక్కడ ఫైమస్ అయిన నాటుకోడి మాంసం కనీసం కేజీనైనా కొన్ని పెట్టాలని చెబుతున్నారు. దీంతో ఇంటికొచ్చే బంధువులకు చేసే మర్యాదల్లో రాజీ ఉండొద్దనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు సైతం భారీగా ధరలు చెల్లించైనా నాటు కోడిని కొనుగోళు చేస్తున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు ఇవేనా?
సాధారణంగా నార్మల్ డేస్‌లో ఇక్కడ నాటుకోడి ధర రూ. 1000 నుంచి రూ.1200 మధ్య ఉంటుంది. అయితే ఒక్కసారిగా కోళ్ల రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఉత్సత్తి తగ్గిపోవడం. గత కొన్నాళ్ల క్రితం వైరల్ కారణంగా చాలా ప్రాంతాల్లో కోళ్లు మృత్యువాడ పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. అటు పల్లెల్లో కూడా జనాలు కోళ్ల పెంపకంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో నాటుకోళ్ల సప్లై భారీగా తగ్గిపోయింది. ఎక్కడా కొళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడైన కోళ్లు ఉన్నాయో అక్కడ వాటికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి