Kodi Pandalu: కోడి పందాలపై కలెక్టర్ ప్రశాంతి ఆంక్షలు.. పండగ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ అమలు

|

Dec 22, 2022 | 2:40 PM

గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ అంటే ముంగిట ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ల సందడి, పిండివంటలు, కోడి పందాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే గోదావరి జిలాల్లో సంక్రాంతి సందడి మొదలైంది.

Kodi Pandalu: కోడి పందాలపై కలెక్టర్ ప్రశాంతి ఆంక్షలు.. పండగ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ అమలు
Cock Fight
Follow us on

తెలుగు వారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్రా, రాయసీమ ప్రాంతాల్లో సంక్రాంతి పండగను ఘనంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ అంటే ముంగిట ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ల సందడి, పిండివంటలు, కోడి పందాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే గోదావరి జిలాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాల కోసం పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో  సంక్రాంతి కోడిపందాలపై ఆంక్షలను విధించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతేకాదు సంక్రాంతి పండగక్కి కోడిపందాలు ఆపాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.

డివిజన్, మండల, గ్రామస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే గత ఏడాది కోడిపందాలకు స్థలాలు ఇచ్చిన యజమానులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు అధికారులు. సంక్రాంతి పండగ దినాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..