West Godavari district: మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి.. ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్

|

Jul 07, 2021 | 6:19 PM

తాచు పాము, కట్ల పాము, జెర్రిగొడ్డు, పొడపాము ఏవి ఎక్కడ మాటు వేసి ఉన్నాయో తెలియదు. చీకటి పడితే రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వాసులు....

West Godavari district: మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి..  ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్
బ్లాక్ మాంబా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటి. ఒక మనిషిని చంపడానికి బ్లాక్ మింబా ఒక మిల్లీగ్రాము పాయిజన్ మాత్రమే సరిపోతుంది, కానీ ఈ పాము దాడి చేస్తే ఒకేసారి 10-12 సార్లు కరిచి అతడి శరీరంలో 400 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది.
Follow us on

తాచు పాము, కట్ల పాము, జెర్రిగొడ్డు, పొడపాము ఏవి ఎక్కడ మాటు వేసి ఉన్నాయో తెలియదు. చీకటి పడితే రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వాసులు. స్థానిక భరద్వాజ నగర్ లోని ఇళ్ళ లోకి ఇటివల వరుసగా పాములు వస్తున్నాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి భయటపడుతన్నారు. అయినా ఇళ్ళలో చిన్నపిల్లలతో ఉండాలంటే భయంగా ఉందంటున్నారు అక్కడి వాసులు. ఇక తాజాగా పేరంపేట పొలాల్లో బుధవారం రెండు పాములు రైతులకు కనిపించాయి. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం రావటంతో పుట్టల్లో దాక్కున్న పాములన్నీ ఇపుడు బయటకువచేస్తున్నాయి. ఇప్పటిదాకా ఎండ వేడికి పుట్టల్లోనూ, కలుగుల్లోనూ, భూమి లోపల దాక్కున్న సర్పాలు మెల్లగా బయటకు వచ్చేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోని ఇళ్లు , పొలాలకు అతి చేరువలోని నివాసాలల్లోకి ఇవి ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి . వంటగదిలో గ్యాస్ బండల వెనుక, బియ్యం మూటల చాటున ఇవి మాటు వేసి జనల్ని హడలు కొడుతున్నాయి . ఇక పొలంపనులకు వెళ్లే వారికి సైతం పాముల బెడద తప్పటం లేదు . గడ్డికోస్తుండగా పొడపాము కరిస్తే ఇక ఆమనిషి జీవితాంతం నరకం అనుభవించాల్సిందే . మిగిలిన పాములు కరిస్తే సకాలంలో వైద్యం తీసుకోక పోతే ప్రాణం పోతుంది . కానీ పొడపాము కరిస్తే ప్రాణం పోదు ..కానీ జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. ఎందుకంటే పొడపాము కరిచిన చోట రక్తనాళాలు దెబ్బతింటాయి . ఇది విడుదల చేసిన హిమోటాక్సిన్ ప్రభావం వల్ల కోలుకున్నతరువాత కూడా మనిషి జీవితాంతం నరకం అనుభవిస్తాడు . ఏడాదికి మూడు సార్లు పాము కుబుసం ఎలా అయితే విడుదల చేస్తుందో ..అదే తరహాలో మనిషి శరీరంలో పొడపాము కరిచిన భాగంలో చర్మం ఊడిపోతుందని బాధితులు చెబుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీలో ప్రమాదకరమైన గిరినాగులు ఉన్నాయి . ఇవి 15 అడుగుల పొడవు వరుకు ఉండి నల్లటి రంగులో చారలను కలిగి ఉంటాయి . ఈ గిరినాగులు ప్రమాదకరమైనవి కావటంతో గిరిజనులు సైతం ఇవి కనపడగానే కొట్టిచంపుతున్నారు. మరో వైపు తణుకు, తాడేపల్లి గూడెం వంటి ప్రాంతాల్లో కొండచిలువలు సైతం సంచరిస్తున్నాయ . ముఖ్యంగా కొల్లేరు పరిసరగ్రామాల్లో చేపలకు వలలు వేస్తే.. కొండచిలువలు చిక్కుకోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇళ్ళ మధ్యనే పాములు తిరుగుతాయా ..?

ఏజన్సీ ప్రాంతంలోనూ , అటవీ ప్రాంతంలోనూ పాములు ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఇవి ఎక్కువగా జనావాసాల్లోనే సంచరిస్తాయని స్నేక్ సేవియర్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అడవుల్లో పాములకు సరైన ఆహారం దొరకదని, అందువల్ల కోళ్లు, ఎలుకలు ఇతర చిన్న చిన్న జీవులు ఉండే చోట ఇవి మాటువేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం పాములు పునరుత్పత్తి చేసుకునే సమయం కావటంతో పాములు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నాయి . ముఖ్యంగా పాముల్లో జాతిని బట్టి విడతకు 80 నుంచి 180 వరకు పిల్లలు పెడతాయట. దీంతో వాటి సంఖ్య అంతకంతకూ అధికమవుతుందని స్నేక్ సేవియర్ సొసైటీ సభ్యులు  తెలిపారు.

Snake

Also Read: కళ్ల ఎదుటే చావు.. అది చూసిన మరో వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం.. ఎక్కడంటే?

ప్రేమంటే ఇదేరా.. రోజూ అన్నం పెట్టే అవ్వకు జ్వరమొచ్చిందని.. !