సప్త నదుల సంగమేశ్వరాలయం క్రమేపి బయటపడుతున్నది. కార్తీక మాసం చివరి రోజు సప్త నదుల సంగమేశ్వర కలశం బయటపడింది. శ్రీశైలం జలశయంలో రోజురోజుకు కృష్ణా జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సప్త నదుల సంగమేశ్వరాలయం బయటపడి భక్తులచే పూజలు అందుకోవడానికి సిద్ధమవుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం కుడి ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా కృష్ణా జలాలు కిందికి తోడేస్తూ ఉండడంతో కృష్ణ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం జలశయంలో 860 అడుగుల నీటిమట్టానికి కృష్ణా జలాలు చేరాయి. కృష్ణా జలాలు తగ్గుముఖ పడడం వల్ల ప్రముఖ శైవ క్షేత్రమైన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం కార్తీక మాసం చివరి రోజున ఆలయ గోపుర కలశం బయటపడింది. గోపుర కలశానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపుర కలశానికి సంధ్యా హారతి ఇచ్చారు.
ప్రస్తుతం ఆలయ గోపురం బయటపడింది. ఇలాగే కృష్ణా జలాలు వాడేస్తే కొద్ది నెలల్లోనే మహా శివరాత్రి రోజు వరకు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి భక్తులకు దర్శనం ఇవ్వవచ్చని ఆలయ పురోహితులు తెలిపారు. సప్త నదుల సంగమేశ్వరాలయం 7 నెలలు క్రిష్ణా జలాలలో పూర్తిగా మునిగిపోయి 5నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఏడు నెలలు పూర్తిగా ఈ ఆలయం కృష్ణా జలాలలో మునిగిపోయిన ఆలయంలోని ప్రధాన శివలింగం వేప మొద్దును భీముడు ప్రతిష్టించాడని చెబుతుంటారు. ఈ శివలింగ ఎంతో మహిళ కలదని అంటుంటారు. ప్రతి సంవత్సరం ఏడు నెలలు నీటిలో మునిగిపోయినా ఇప్పటికీ వేపదారు శివలింగం ఏమాత్రం చెక్కు చెదరపోకవడం ఆశ్చర్యకరం.
సంగమేశ్వర దేవాలయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పణ్య క్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 7 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 5 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం ఇది. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది. అందుకే ఈ ఆలయం భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..