Andhra Pradesh: ఆ జిల్లాలో సమ్మె సమయంలో పడిన జీతాలు.. చెల్లింపులో చిత్రవిచిత్రాలు.. మరణించినవారికి కూడా జమ..

|

Feb 10, 2022 | 11:29 AM

Andhra Pradesh: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఉద్యోగుల సమ్మె(Employees Strike) కొందరికి బంపర్ ఆఫరిచ్చింది. ఉద్యోగుల సమ్మెతో నేరుగా ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ ద్వారా జమ అయిన జీతాల్లో..

Andhra Pradesh: ఆ జిల్లాలో సమ్మె సమయంలో పడిన జీతాలు.. చెల్లింపులో చిత్రవిచిత్రాలు.. మరణించినవారికి కూడా జమ..
Ap Employees Strike
Follow us on

Andhra Pradesh: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఉద్యోగుల సమ్మె(Employees Strike) కొందరికి బంపర్ ఆఫరిచ్చింది. ఉద్యోగుల సమ్మెతో నేరుగా ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ ద్వారా జమ అయిన జీతాల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలోని నలుగురు ఐఏఎస్ అధికారులకు కూడా రెండు జీతాలు జమ అయినట్లు గుర్తించి రికవరీ చర్యలు చేపట్టారు. అయితే మరో వైపు  ఇప్పటివరకూ కొందరు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జీతాలే పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 50678 ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇప్పటికీ జనవరి నెల జీతాలు అందక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. డిసెంబర్ లో రిటైర్డ్ అయిన వారికి, సస్పెన్షన్ లో ఉన్న వారికి, సెలవుల్లో ఉన్నవారికి కూడా జనవరి నెల జీతం వచ్చింది. ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తప్పు తప్పులుగా పడడంతో.. సంబంధిత ట్రెజరీ సిబ్బంది హడావుడిగా దిద్దుబాటు పనులను చేపట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది. సర్వీసులో లేని వారి ఖాతాల్లో పడ్డ డబ్బులు వారి వివరాలు సేకరించడం తలకు మించిన భారమైంది.
చనిపోయిన వారికి కూడా జమ అయిన జీతాల వివరాలు సేకరిస్తున్న అధికారులు తలమునకలై పోగా జీతాల చెల్లింపులో జరిగిన పొరపాట్లపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం నుంచి కూడా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు అందాయి. పోలీసు శాఖలోని ఉద్యోగులకు ఎలాంటి డిడక్షన్స్ లేకుండానే మొత్తం గ్రాస్ శాలరీ పడిపోగా వాళ్ల ఖాతాల నుంచి తిరిగి చలానా రూపంలో డబ్బులు రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Reporter:  MPR Raju Tirupati

Also Read:   ఈరోజు టెడ్డీ డే.. మీ భాగస్వామికి ఇచ్చే టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత ఏమిటంటే..