Kanipakam: కాణిపాకం వినాయకుడికి ఓ భక్తుడు రూ. 7 కోట్ల విరాళం.. భక్తుడి పేరు మాత్రం చెప్పలేదు.. ఎందుకంటే..

|

Feb 27, 2021 | 8:41 PM

Kanipakam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నాడు. ఆలయ ఈవో వెంకటేష్‌కు ఈ విరాళం..

Kanipakam: కాణిపాకం వినాయకుడికి ఓ భక్తుడు రూ. 7 కోట్ల విరాళం.. భక్తుడి పేరు మాత్రం చెప్పలేదు.. ఎందుకంటే..
Follow us on

Kanipakam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నాడు. ఆలయ ఈవో వెంకటేష్‌కు ఈ విరాళం చెక్కును అందజేశారు. కాణిపాక ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ భక్తుడు మొత్తాన్ని తానే ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మొదటి విడతగా 7 కోట్ల రూపాయలు అందజేశాడు. మిగతా మొత్తం త్వరలోనే అందజేస్తానని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయానికి వచ్చిన దాతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు.

అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అయితే విరాళం ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు. స్వామి వారిపై ఉన్న భక్తితో ఇచ్చిన కానుకకు ప్రచారం అవసరం లేదని ఆయన తెలిపినట్లు సమాచారం. ఆలయ అధికారులు కూడా వివరాలను గోప్యంగా ఉంచారు. త్వరలోనే ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామని ఈవో తెలిపారు. ప్రసిద్ది చెందిన కాణిపాకం వినాయకస్వామికి ఎంతో మంది భక్తులున్నారు. ప్రతి రోజు భారీ స్థాయిలో భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వయంగా బావిలో వెలసిన వినాయకస్వామికి అక్కడే ఆలయం నిర్మించడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

తిరుమల శ్రీవారికి..

మరోవైపు శుక్రవారం తిరుమల శ్రీవారికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నాడు. పాస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పస్సి, శాలినీ పస్సీ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు డీడీలను శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీరంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ కు రూ.9 కోట్లు సర్వశ్రేయస్సు ట్రస్టుకు రూ.కోటి అందజేశారు.

అలాగే శ్రీవారికి తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు 2 కోట్ల రూపాయల విలువైన శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తంగదొరై అనే భక్తుడు మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు తెలిపారు. ఇలా తిరుమల స్వామికి, కాణిపాకం వినాయక స్వామికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. స్వామివార్లపై ఉన్న భక్తిలో కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇలా తిరుమల శ్రీవారికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటారు.

ఇవి చదవండి:

Narasimha Jharni : ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం, 600 మీటర్ల లోతు నీటిలో ప్రయాణం

Lost Cities in India : భారత దేశంలో చరిత్రలో కనుమరుగైన అద్భుత నగరాలు.. నేటికీ అవి మన విజ్ఞానానికి సజీవ సాక్ష్యాలు