Vizag: విశాఖపట్నంలో అలజడి.. ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. వామ్మో కారణం అదేనా..?

| Edited By: Shaik Madar Saheb

Jan 05, 2024 | 8:38 PM

సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది. దీంతో సముద్రంలో అలజడి రేగింది. ఎక్కడో జపాన్‌లో భూకంపం వస్తే అంత దూరం వెళ్తుందా? అసలు కారణం అదేనా? వేరే ఏమైనా కారణాలా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి.

Vizag: విశాఖపట్నంలో అలజడి.. ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. వామ్మో కారణం అదేనా..?
Vizag
Follow us on

సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది. దీంతో సముద్రంలో అలజడి రేగింది. ఎక్కడో జపాన్‌లో భూకంపం వస్తే అంత దూరం వెళ్తుందా? అసలు కారణం అదేనా? వేరే ఏమైనా కారణాలా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి.

తీరం నుంచి దాదాపు 100 అడుగుల మేర సముద్రం వెనక్కి తగ్గింది. గత మూడు, నాలుగు రోజులుగా ఇలాగే జరుగుతోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తీరానికి దగ్గర్లో ఉంటున్న జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2న ఆర్కే బీచ్ దగ్గర సుమారు 100 అడుగుల దూరం సముద్రం వెనక్కివెళ్లింది. ఈ నెల 4న కూడా కూడా సముద్రం వెనక్కివెళ్లింది. తాజాగా 100 అడుగులు వెనక్కి వెళ్లడంతో చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది. అయితే, జపాన్ లో భూకంపమా? లేక ఆటు పోటు నా? అన్న దానిపై ఎవరి విశ్లేషణలు వాళ్లకు ఉన్నాయ్.

ఆందోళన.. ఆశ్చర్యం..

సాధారణంగా విశాఖ బీచ్ లో ఏ చిన్నపాటి మార్పు జరిగినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే విశాఖ వాసులు నిత్యం ఏదో ఒక సమయంలో బీచ్ ని సందర్శించి వెళ్లనిదే రోజు గడవదు. నగరంలో ఉన్న యువత, మహిళలు, పిల్లలు పెద్దలు అందరూ.. కుటుంబాలుగా వచ్చి బీచ్ లోనే ఆడి పాడి వెళ్తారు. నిత్యం బీచ్ తోనే జీవితం ముడిపడి ఉండడంతో ఏ చిన్నపాటి మార్పులైనా ఇట్టే పసికట్టేస్తారు. తాజా పరిణామంతో రెండో తేదీ ఒక్కసారిగా అక్కడికి వచ్చిన జనం ఇంత భారీ స్థాయిలో సముద్రం ఎందుకు వెనక్కి పోయిందా అని చర్చించుకోవడం కనిపించింది. సాధారణంగా ఆటు – పోటు సమయంలో సముద్రం కొద్దిగా కాస్త వెనక్కి వెళ్ళడం లేదంటే ముందుకు రావడం, సముద్రం ఎత్తు పెరగడం లాంటి అనేక ఘటనలు చూస్తుంటాం.. కానీ ఈసారి ఈ స్థాయిలో వెనకకుపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Vizag Beach

సాధారణంగా ఇది టూరిస్ట్ సీజన్. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల పర్యటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. విశాఖ బీచ్ తో పాటు పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూసి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సముద్రం నీరు వెనక్కి వెళ్లడంతో లోపల ఉండే సముద్రపు రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఫోటోలు తీసుకునేందుకు పోటీలు పడుతున్నారు జనాలు..

వీడియో చూడండి..

సముద్రం వెనక్కి పోవడంపై మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ.. జపాన్లో జరిగిన భూకంపానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భౌగోళికంగా అది సంభవం కాకపోవచ్చని, సముద్రం లోపల జరిగే అనేక రకాల పరిణామాలు తీరాలపై ప్రభావం చూపిస్తాయని, అది సహజమైన ప్రక్రియనే అన్నది ప్రొఫెసర్ విశ్లేషణ. మొత్తానికి సముద్రం కాస్త లోపలకు వెళ్లడంతో పర్యాటకులు ఇంకాస్త లోపలకు వెళ్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తుండడం విశేషం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..