Vizag: కంబాలకొండ అడవుల్లో అరుదైన సరీసృపం ప్రత్యక్షం.. ఆసక్తికర విషయాలు మీకోసం..

|

May 23, 2023 | 5:37 PM

ప్రపంచంలోనే అరుదైన సరిసృపం విశాఖ కంబాలకొండల అభయారణ్యంలో కనిపించింది. బార్కుడియ లింబ్ లెస్ స్కింక్ అనేది దీని శాస్త్రీయ నామంగా పరిశోధకులు అన్నారు.

Vizag: కంబాలకొండ అడవుల్లో అరుదైన సరీసృపం ప్రత్యక్షం.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Snake
Follow us on

ప్రపంచంలోనే అరుదైన సరిసృపం విశాఖ కంబాలకొండల అభయారణ్యంలో కనిపించింది. బార్కుడియ లింబ్ లెస్ స్కింక్ అనేది దీని శాస్త్రీయ నామంగా పరిశోధకులు అన్నారు. ఇది బిందె పాము జాతికి చెందినది. మడ అడవుల్లో మాత్రమే ఇటువంటి సరిసృపాలు కనిపిస్తూ ఉంటాయి. విశాఖపట్నం, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటి జాడలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుదైన ఈ సరీసృపాలను పరిరక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

విశాఖ నగరంలో జీవవైవిద్యానికి కంబాలకొండ అభయారణ్యం ప్రత్యేక ప్రాంతం. ఈ వన్యప్రాణి అభయారణ్యంలో అనేక వృక్షజాతులు, జంతువులతో ప్రకృతి ప్రేమికులు, ఔత్సాహికులు, పరిశోధకులకు ఆకర్షిస్తూ ఉంటుంది. 71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కంబాలకొండ ప్రాంతంలో.. అరుదైన పాము జాడలు కంబాలకొండ పరిధిలో కనిపించాయి. మడ అడవుల్లో కనిపించే బిందె పాము జాతికి చెందిన బార్కుడియా లింబ్‌లెస్‌ స్కింక్‌ స్నేక్‌ని అభయారణ్యంలో గుర్తించినట్లు డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ ప్రకటన విడుదల చేశారు. బార్కుడియా లింబ్‌లెస్‌ స్కింక్‌ స్నేక్‌లు విరివిగా కనిపించేవట. ఆ తర్వాత క్రమంగా అంతరించిపోయాయని అంటున్నారు.

అనంతరం ఈ బార్కుడియాలు కంబాలకొండలో దర్శనమివ్వలేదు. ఒడిస్సా, భువనేశ్వర్ అడవి ప్రాంతంలో అక్కడక్కడ ఈ ప్రాణులు నివసించేవట. అయితే కంబాలకొండ అభయారణ్యంలో తొలిసారిగా ఈ అరుదైన సరీసృపం బార్కుడియా కనిపించింది. ఏపీ అటవీశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రాజెక్టు సైంటిస్ట్‌ అడారి యజ్ఞపతి దీన్ని గుర్తించారు. 16.5 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే ఈ లింబ్‌లెస్‌ స్కింక్‌ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. జీవిత కాలంలో అధిక భాగం భూగర్భంలోనే నివాసం ఉంటుంది. వర్షాలు పడినప్పుడు సంతనాధిపతి కోసం భూమిపైకి వచ్చి కనిపిస్తుంటుంది. బార్కుడియా స్నేక్‌ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.