Konaseema: అయ బాబోయ్.. గోదావరిలో కచ్చు పీతలు దొరికాయ్.. రేటెంతో తెల్సా

|

Dec 16, 2024 | 4:00 PM

మత్స్యకారుడు వేటకు వెళ్లగా వలలో అరుదైన పీతలు చిక్కాయి. ఈ పీతల గుడ్లును నీటిలో వదులితే.. వేలాది పీత పిల్లలు వృద్ధి చెందుతాయట. నాలుగు నెలల్లో అవి మంచి సైజుకు వస్తాయని జాలర్లు చెబుతున్నారు.

Konaseema: అయ బాబోయ్.. గోదావరిలో కచ్చు పీతలు దొరికాయ్.. రేటెంతో తెల్సా
Rare Crabs
Follow us on

వల వేసిన ప్రతిసారి.. మంచి మంచి చేపలు, రొయ్యలు, పీతలు పడాలని ఉండదు. కొన్నిసార్లు నిరాశజనకంగానే జాలర్లు ఒడ్డుకు వస్తారు. మరికొన్నిసార్లు మాత్రం లక్ కలిసొచ్చి.. కచ్చిడి చేపలు లాంటి అరుదైన, విలువైన జల సంపద వచ్చిపడుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలో మత్స్యకారుడి వలలో అరుదైన పీతలు చిక్కాయి. కోరంగి సమీపంలోని గోదావరిలో వలలో అరుదైన పీతలు పడ్డాయి. ఆదివారం తమ వలలో రెండు కచ్చు పీతలు చిక్కాయని, ఒక్కో కచ్చు పీత రేటు రూ.400 ఉంటుందని మత్స్యకారుడు తెలిపాడు. ఈ రెండింటి గుడ్లతో.. ఎన్నో పీతలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని జాలరి చెబుతున్నాడు.

ఈ పీతలు చూడటానికి మాములుగానే..  ఉన్నప్పటికీ వీటి గుడ్లు ఎర్రగా ఉన్నాయి. ఈ గుడ్లను నీటిలో వదులుతాయి. వాటి నుంచి వేలాది పీత పిల్లలు ఉత్పత్తి అవుతాయి.  కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పండి, పొర గ్రామాల్లో పీతల పెంపకం చేస్తారు. ఆ క్షేత్రాల్లో కచ్చుపీతలను.. చెరువుల్లోకి వదులుతారు. ఆ గుడ్ల ద్వారా వచ్చే చిన్న పీత పిల్లలను పెంపకం చేపడతారు. ఇవి నాలుగు నెలల్లో అరకేజీ నుంచి కేజీ పీతలుగా పెరుగుతాయని స్థానిక చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి