యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‌కు వేదికైన ఏపీ..
ఆమె పేరు నసీమా.. వయస్సు 37 ఏళ్లు.. ఉండేది యుకేలో. ఆఫ్రికా - అమెరికన్ సంతతికి చెందిన మహిళ. అయితే విచిత్రమైన వ్యాధితో గత కొంతకాలం నుండి బాధ పడుతోంది. డీప్ సీటెడ్ గ్లియోమాతో అవస్తలు పడుతున్న ఆమె సరైన చికిత్స ఎక్కడ లభిస్తుందా అన్న విచారణ మొదలు పెట్టింది. మొదడులో లోపలి భాగంలో ఉన్న కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.

ఆమె పేరు నసీమా.. వయస్సు 37 ఏళ్లు.. ఉండేది యుకేలో. ఆఫ్రికా – అమెరికన్ సంతతికి చెందిన మహిళ. అయితే విచిత్రమైన వ్యాధితో గత కొంతకాలం నుండి బాధ పడుతోంది. డీప్ సీటెడ్ గ్లియోమాతో అవస్తలు పడుతున్న ఆమె సరైన చికిత్స ఎక్కడ లభిస్తుందా అన్న విచారణ మొదలు పెట్టింది. మొదడులో లోపలి భాగంలో ఉన్న కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. అయితే ఇందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కడ మెరుగైన వైద్యం లభిస్తుందా అని సమాచారం సేకరించింది.
చివరికి గుంటూరులోని రావూస్ హాస్పిటల్లో డాక్టర్ మోహన్ రావు తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తారని తెలుసుకున్న ఆమె గుంటూరు వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మోహన్ రావు బృందం అధునాతన పద్దతుల్లో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్ పాత్ సర్జరీ విధానంలో శస్త్ర చికిత్స చేస్తే విజయవంతమవుతుందని భావించారు. మెదడులో ఏడు సెంటీ మీటర్ల లోపల ఉన్న కణితిని గుర్తించేందుకు ఎండోస్కోప్, సబ్ కోర్టికల్ న్యూరో మ్యాపింగ్, న్యూరో మోనిటరింగ్ విధానాలను ఉపయోగించారు. కణితిని గుర్తించిన తర్వాత విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటుంది. న్యూరో సర్జరీ విభాగంలో రావూస్ హాస్పటిల్ ఇప్పటికే పలు అరుదైన ఆపరేషన్లు చేసి ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు పొందింది.
గుంటూరు లాంటి సిటీల్లో మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందిస్తుండటంతో డాక్టర్ మోహన్ రావు వద్ద అరుదైన వ్యాధులకు చికిత్స చేయించుకునేందుకు విదేశాల నుండి రోగులు క్యూ కడుతున్నారు. మెట్రో పాలిటిన్ సిటీస్‌లో చాల ఎక్కువ ఖర్చు అవుతుండటతో తట్టుకోలేని రోగులు తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్య విధానాలను ఉపయోగించి విజయవంతంగా ఆపరేషన్లు చేస్తున్న రావూస్ హాస్పటల్‌కు వస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని రోగులు గుంటూరు వస్తుండటంతో ఈ నగరానికి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది గుంటూరు వైద్యులు దేశ విదేశాల్లో పేరుగణించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




